ఆరు గ్యారంటీల అమలులో విఫలం
పెద్దశంకరంపేట(మెదక్): ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం వరంగల్ రజతోత్సవ సభకు భారీ సంఖ్యలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి, సభకు వెళ్తున్న వాహనాలను జెండా ఊపి ప్రారంభించి ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెబుతారన్నారు. సభకు తరలిన వారిలో మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, మాజీ వైస్‌ఎంపీపీ లక్ష్మీరమేశ్, సురేశ్‌గౌడ్, సుభాష్ తదితరులున్నారు.


