రజతోత్సవ సభకు తరలిరండి
నర్సాపూర్: వరంగల్‌లో ఆదివారం నిర్వహించ తలపెట్టిన బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. నియోజకవర్గం నుంచి మూడు వేల మందిని తరలించాలని అధిష్టానం నిర్ణయించగా, ఐదు వేల మంది వచ్చేందుకు ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అన్నివర్గాల ప్రజల సంక్షేమానికి కేసీఆర్ పెద్దపీట వేశారని కొనియాడారు. వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి సస్యశ్యామలం చేశారన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్ పాలన మళ్లీ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో బీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గం నుంచి సుమారు 70 బస్సులు, 190 కార్లలో వరంగల్ బహిరంగ సభకు పార్టీ నాయకులు తరలివెళ్లేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆమె వివరించారు. కాగా ఆదివారం ఉదయం ప్రతి గ్రామంలో పార్టీ జెండా ఎగురవేసి సభకు బయలు దేరా లని సునీతారెడ్డి నాయకులకు సూచించారు. సమా వేశంలో పార్టీ నాయకులు శేఖర్, నయీం, నర్సింలు, భిక్షపతి, జితేందర్‌రెడ్డి, రాంచందర్, రాకేష్‌గౌ డ్, సుధాకర్‌రెడ్డి, విఠల్ తదితరులు పాల్గొన్నారు.
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి


