సన్న బియ్యం పేదలకు వరం
అల్లాదుర్గం(మెదక్)/నిజాంపేట: ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం పేదలకు వరంగా మారిందని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని గడిపెద్దాపూర్‌లో లబ్ధిదారుడి ఇంట్లో సన్న బియ్యంతో భోజనం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేషన్‌షాపుల్లో నాణ్యమైన సన్న బి య్యం అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం నిజాంపేట మండల పరిధిలోని కె. వెంకటపూర్‌లో కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించాలని ఆదేశించారు.
కేసీఆర్ పాలన స్వర్ణయుగం
తూప్రాన్: కేసీఆర్ పదేళ్ల పాలన స్వర్ణయుగం అని బీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. వరంగల్ రజతోత్సవ సభ నేపథ్యంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డితో కలిసి పట్టణంలో సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసత్య పునాదుల మీద ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 15 నెలల కాలంలో హామీలను తుంగలో తొక్కిందన్నారు. ఆరు గ్యారంటీలను విస్మరించిందని విమర్శించారు. వరంగల్ సభ ప్రతిష్టాత్మకమని.. నియోజకవర్గంలోని ప్రతి ఊరు నుంచి పెద్ద సంఖ్యలో గులాబీ సైనికులు తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు సత్యనారాయణగౌడ్, రాఘవేందర్‌గౌడ్, దుర్గారెడ్డి, వెంకటేశ్, సత్యలింగం, శ్రీనివాస్, బురాన్, తదితరులు పాల్గొన్నారు.
కొమురవెల్లిలో
సమూల మార్పులు
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో సమూల మార్పులకు ఈఓ అన్నపూర్ణ శ్రీకారం చుట్టారు. ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆలయ ఉద్యోగులు, అర్చకులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. సిబ్బ ంది పంచె, తెల్ల చొక్కాతో విధులకు హాజరుకావాలని ఆదేశించారు. ఆలయంలో నిర్వహిస్తున్న వేద పాఠశాల విద్యార్థులు అన్నదాన సత్రం నుంచి టిఫిన్, భోజనం తెచ్చుకునే వారు.. గమనించిన ఈఓ శుక్రవారం వేద పాఠశాల ఆవరణలోనే వంటను ప్రారంభించారు. అలాగే విద్యార్థులకు దేవాదాయ ధర్మదాయ శాఖ ఆగమ సలహాదారు మహంతయ్య ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించగా పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో ఏఈఓ బుద్ది శ్రీనివాస్, ఆలయ ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్, పర్యవేక్షకులు శ్రీరాములు, సురేందర్‌రెడ్డి, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం
మెదక్ మున్సిపాలిటీ: బీసీలకు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం కావాలని, పథకాలకు పరిమితమైతే అభివృద్ధి అంధకారమవుతుందని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేష్ అన్నారు. శుక్రవారం బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గండి వీరేందర్‌గౌడ్‌తో కలిసి పట్టణంలో విలేకరులతో మాట్లాడారు. కులగణనతో రాష్ట్రంలో బీసీ సామాజిక విప్లవం మొదలైందన్నారు. బీసీ నాయకత్వాన్ని బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా నేటి నుంచి జిల్లాల పర్యటన ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అనంతరం జిల్లా ఇన్‌చార్జి కన్వీనర్‌గా ఉగ్గి అంజయ్య, జిల్లా ఇన్‌చార్జిగా పాతూరి దయాకర్‌గౌడ్‌లను నియమించారు.
సన్న బియ్యం పేదలకు వరం
సన్న బియ్యం పేదలకు వరం
సన్న బియ్యం పేదలకు వరం


