మంచిర్యాలక్రైం: రామగుండం పోలీసు కమిషనరేట్ పరిధిలో అక్రమ దందాలు, అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, అక్రమ రవాణాపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వరుసదాడులతో అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టిస్తున్నారు. టాస్క్ఫోర్స్ను ఎత్తేయడంతో రెండేళ్లపాటు కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక బృందాలు అడపాదడపా పేకాట, గంజాయి, నకిలీ విత్తనా లపై అందిన సమాచారం మేరకు దాడులు చేశారు. ‘నో ఫ్రెండ్లీ పోలీసింగ్.. అంత స్ట్రాంగ్ పోలీసింగే’ అని డీజీపీ కచ్చితమైన ఆదేశాలు జారీ చేయడంతో టాస్క్ఫోర్స్ బృందాలు దూకుడు పెంచాయి. కమి షనరేట్ పరిధిలో మూడు నెలల క్రితం టాస్క్ఫో ర్స్, నార్కోటిక్, ఈగల్టీమ్ బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఏసీపీ పర్యవేక్షణలో ముగ్గురు ఎస్సైలు, పది మంది కానిస్టేబుళ్లు బృందాన్ని రంగంలోకి దింపారు. దీంతో టాస్క్ఫోర్స్ పోలీసులు జిల్లాలో మట్టి, ఇసుక, రేషన్ బియ్యం, నకిలీ విత్తనాలు, గంజాయి, గుడుంబా, కలప అక్రమ రవాణాదారులు ఆగడాలకు అడ్డుకట్ట వేస్తున్నారు.
ఆకస్మిక దాడులు
మంచిర్యాల నుంచి మహారాష్ట్రకు నిత్యం వందల టన్నుల కొద్ది రేషన్ బియ్యం చెన్నూర్ మీదుగా మహారాష్ట్రలోని సిరోంచకు అక్రమంగా తరలిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి మంచిర్యాలకు దేవీదారు తరలివస్తోంది. జిల్లా సరిహద్దులోని గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్షాపుల్లో గుడుంబా, దేశీదారు జోరుగా విక్రయిస్తున్నారు. గూడెం, భీమిని, జన్నారం, కోటపల్లి మండలాల్లో మట్టి, ఇసుక మైనింగ్, పేకాట, కోడిపందేలు, అటవీశాఖ అధికారుల అనుమతి లేకుండా కలప తరలిస్తూ సహజ సంపదను కొల్లగొడుతున్నారు. దీంతో టాస్క్ఫోర్స్ పోలీసులు వరుస దాడులు చేస్తూ కటకటాల్లోకి పంపిస్తున్నారు. టాస్క్ఫోర్స్ పోలీసుల దాడులతో రహస్యంగా కొన్ని లాడ్జిలు, శివారు ప్రాంతాలు, నివాస గృహాల్లో పేకాట ఆడుతున్నారు. కొందరు పేకాటరాయుళ్లు మహారాష్ట్ర, సరిహద్దు ప్రాంతంలోని సిరోంచ, రాజురాకు ప్రత్యేక వాహనాల్లో వెళ్లి పేకాట ఆడుతున్నారు. ఈ ఏడాదిలో టాస్క్ఫోర్స్ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు 15కేసులు నమోదు చేసి రూ.6,27,800 నగదు స్వాధీనం చేసుకున్నారు. 104 మంది పేకాటరాయుఽళ్లను అరెస్ట్ చేశారు.
జిల్లాలో ఇటీవల కొన్ని ఘటనలు..
ఈ ఏడాదిలో దాడులు
టాస్క్ కేసులు కేజీ/లీటరు విలువ రూ.లలో నిందితులు అరెస్ట్
గంజాయి 43 12.014 కేజీ 5,87,807 84 79
రేషన్ బియ్యం 24 471.77 క్వింటళ్లు 28,22,583 28 28
పేకాట/కోళ్ల పందెం 15 –– 6,27,800 104 104
ఫెస్టిసైడ్స్ 05 411లీటర్ల గ్లైఫోసెట్ 3,04,660 07 07
కల్తీ పచ్చళ్లు 03 600 కేజీ 90,000 03 ––
యూరియా 02 363.50 క్వింటళ్లు 5,75,900 04 04
పశువుల 03 58 పశువులు – 14 14


