తెలుగులోనే సేవలు అందించాలి | - | Sakshi
Sakshi News home page

తెలుగులోనే సేవలు అందించాలి

Oct 15 2026 8:42 AM | Updated on Oct 15 2026 8:42 AM

మంచిర్యాలఅగ్రికల్చర్‌: ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారిక కార్యకలాపాలను వీలైనంత వరకు తెలుగులోనే నిర్వహిస్తూ సామాన్య ప్రజలకు ప్రభు త్వ సేవలు, పథకాలు, అధికారిక సమాచారాన్ని సులభంగా అర్థమయ్యే భాషలో అందించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ పి.చంద్రయ్య అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన అధికార భాష అమలు సమావేశం, సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్‌ వి.రాములు, డీఅర్వో మోతిరామ్‌, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్‌రావుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు, శంకుస్థాపన కార్యక్రమాల వివరాలు, అధికారుల నామఫలకాలు, హోదాలు, హాజరు రిజిష్టర్లు, సెలవు దరఖాస్తులు, కార్యాలయ ఉత్తర ప్రత్యుత్తరాల్లో తెలుగు భాషను ఉపయోగించాలని తెలిపారు.

స.హ చట్టం పారదర్శకంగా నిర్వహించాలి

సమాచార హక్కు చట్టం వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్య మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం–2005 ప్రకారం దరఖాస్తుదారులకు నిర్ణీత గడువులో సమాచారాన్ని అందిస్తూ పారదర్శకత, జవాబుదారీతనాన్ని పాటించాలని తెలిపారు. అనంతరం సమాచార హక్కు చట్టం, సెక్షన్లపై అధికారులకు అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. అంతకుముందు జిల్లాలో బతుకమ్మ సంబరాలను పురస్కరించుకుని తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల ప్రతినిధులతో కలిసి వాల్‌పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్‌ ఏవో శ్రీనివాసరావు దేశ్‌పాండే, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement