మంచిర్యాలటౌన్: జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తమ డిమాండ్లు తీర్చాలని సమ్మె బాట పట్టారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వివిధ కేటగిరీల్లో 78క్యాడర్లలో 367 మంది పని చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల మంది సమ్మె బాట పట్టడంతో వైద్య సేవలపై తీవ్ర ప్రభావం పడుతోంది. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న వేళ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమ్మెతో ఇబ్బందిగా మారింది. పనిచేస్తున్న వారిలో 70శాతం మంది ఎన్హెచ్ఎం ఉద్యోగులు ఔట్సోర్సింగ్ కాగా.. వారి డిమాండ్ల సాధన కోసం కలెక్టరేట్ ఎదటు ఈ నెల 13నుంచి నిరవధిక సమ్మె చేపట్టారు. సగం మంది నిరవధిక సమ్మెలో పాల్గొని గత రెండు రోజులుగా వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. కళ్లకు గంతలు కట్టుకుని ర్యాలీ, బతుకమ్మ ఆడుతూ సమ్మె కొనసాగిస్తున్నారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలు అందించిన ఎన్హెచ్ఎం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి తక్కువ వేతనాలతో పనిచేస్తూ కుటుంబ పోషణలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వాపోతున్నారు.
ప్రధాన డిమాండ్లు ఇవే...


