క్వారీలో జంగల్‌ సఫారీ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

క్వారీలో జంగల్‌ సఫారీ ప్రారంభం

Oct 15 2026 8:42 AM | Updated on Oct 15 2026 8:42 AM

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): హాజీపూర్‌ మండలం గఢ్‌పూర్‌ గ్రామ పరిధిలోని ఎంసీసీ క్వారీ అడవిలో బుధవారం నుంచి గాంధారీ ఖిల్లా జంగల్‌ సఫారీ ప్రారంభమైంది. కవ్వాల్‌ టైగర్‌ రిజర్వు ఫారెస్ట్‌ పరిధిలోని పాతమంచిర్యాల అటవీ బీట్‌ పరిధిలో సఫారీ సాగుతుంది. పెద్దపులి, చిరుత పులులు, ఎలుగుబంట్లు, అడవి బర్రెలు, దుప్పులు, మెఖములు, చుక్కల దుప్పులు, అడవి కుక్కలు, నక్కలు, సాంబర్‌లు, అడవి పందులు, నెమళ్లు ఇలా వివిధ రకాల వన్యప్రాణులతోపాటు నీటి కుంటలు వీక్షించవచ్చు. 25 కిలోమీటర్ల సఫారీలో మధ్య మధ్యలో ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్లు, మంచెలు, వాచ్‌ టవర్ల ద్వారా చరిత్రాత్మక ప్రాంతం గాంధారీ ఖిల్లా, దట్టమైన అడవులు పర్యాటకులు వీక్షించవచ్చు. ఒక్కో రైడ్‌ రూ.2,100 ఉండగా జంగల్‌ సఫారీ బుక్‌ చేసుకునే వారు 99488 05488 నంబరులో సంప్రదించాలని లక్సెట్టిపేట అటవీ రేంజ్‌ అధికారి సంతోష్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement