జైపూర్: రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్లు గుర్తించి భద్రతా చర్యలు చేపట్టాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా ఆదేశించారు. జైపూర్ పో లీస్స్టేషన్ను బుధవారం ఆయన జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్తో కలిసి తనిఖీ చేశారు. స్టేషన్ నిర్వహణ, కేసుల నమోదు, సీసీటీఎస్ఎస్ పనితీరు పరిశీలించారు. నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, రౌడీషీటర్లు, అనుమానితుల కదలికలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. 5ఎస్ మేనేజ్మెంట్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ఇటీవల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతీ పోలీస్స్టేషన్ పరిధిలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ నవీన్కుమార్, ఎస్సై భూమేశ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


