
160 గంజాయి మొక్కలు స్వాధీనం
ఆదిలాబాద్‌రూరల్: ఆదిలాబాద్ రూరల్ మండలం అసోద గ్రామంలో సాగవుతున్న 160 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి తెలిపారు. రూరల్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అసోద గ్రామంలో తన పొలంలో మెశ్రం భుజంగ్‌రావు అంతర పంటగా 160 గంజాయి మొక్కలు సాగు చేస్తున్నాడు. పక్కా సమాచారంతో రూరల్ ఎస్సై విష్ణువర్ధన్ ప్రత్యేక బృందంతో తనిఖీ చేపట్టి పత్తి, కంది పంట మధ్యలో ఉన్న గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.16లక్షల వరకు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. జిల్లాలో గంజాయి సాగు, అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామన్నారు. గంజాయి పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన రూరల్ సీఐ కె.ఫణిధర్, రూరల్ ఎస్సై విష్ణువర్ధన్, సిబ్బంది మంగల్ సింగ్, విఠల్, సురేశ్ ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు.