రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

Oct 10 2025 5:54 AM | Updated on Oct 10 2025 6:36 AM

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ముల్కల్ల ప్రాంతానికి చెందిన మంతెన శ్రీనివాస్‌(49) రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. హాజీపూర్‌ ఎస్సై స్వరూప్‌రాజ్‌ కథనం ప్రకారం.. ముల్కల్లకు చెందిన శ్రీనివాస్‌ అనే పాల వ్యాపారి బుధవారం రాత్రి జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. రోడ్డు దాటుతున్న క్రమంలో లక్సెట్టిపేట వైపు వెళ్తున్న బైక్‌ వేగంగా ఢీకొట్టింది. దీంతో శ్రీనివాస్‌ ఎగిరిపడగా తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి పంచించారు. చికిత్సపొందుతూ గురువారం ఉదయం మృతిచెందాడు. మృతుడికి భార్య కవిత, కుమారుడు హర్షిత్‌, కుమార్తె హరిణీ ఉన్నారు. భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు..

కడెం: మండలంలోని కొండుకూర్‌ గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మర్రిపెల్లి మ ల్లవ్వ (75) మృతిచెందింది. వివరాలు ఇలా ఉన్నాయి.. మల్లవ్వ.. మండల కేంద్రంలోని మార్కెట్‌లో బుధవారం కారం, పసుపు విక్రయించి రాత్రి ఆటోలో గ్రామానికి చేరుకుంది. ఆటో దిగి రోడ్డు దాటేక్రమంలో గుర్తుతెలియని బైక్‌ ఆమెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మల్లవ్వకు గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం ఇంటికి వచ్చింది. గురువారం తెల్లవారుజామున మల్లవ్వ మృతిచెందింది. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

కుంటలో పడి యువకుడి..

నిర్మల్‌రూరల్‌: మండలంలోని ముజిగి–చిట్యాల గ్రామాల మధ్య రహదారి వెంబడి ఓ చెట్టును ఢీకొని పక్కనే ఉన్న నీటికుంటలో పడి యువకుడు మృతి చెందాడు. రూరల్‌ ఎస్సై లింబాద్రి కథనం ప్రకారం.. దిలావర్‌పూర్‌ మండలం కాలువతండా గ్రామానికి చెందిన మెగావత్‌ శ్రీనివాస్‌ (25) రెండురోజుల క్రితం బైక్‌పై నిర్మల్‌ మండలంలోని ముజిగి గ్రామానికి బయల్దేరి వెళ్లాడు. ఈ క్రమంలో గ్రామ సరిహద్దు వద్ద అదుపు తప్పి ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొని పక్కనే ఉన్న నీటికుంటలో పడి ఊపిరాడక చనిపోయాడు. గురువారం ఉదయం స్థానికులు గమనించి రూరల్‌ పోలీసులకు సమాచారమిచ్చారు. రూరల్‌ ఎస్సై లింబాద్రి అక్కడికి చేరుకుని బైక్‌ నంబర్‌ ఆధారంగా మృతుడి వివరాలు తెలుసుకున్నాడు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, మృతదేహాన్ని నిర్మల్‌ ఏరియాస్పత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

పేకాట ఆడుతున్న ఆరుగురి అరెస్ట్‌

ఆదిలాబాద్‌టౌన్‌: పేకాట ఆడుతున్న ఆరుగురిని అ రెస్టు చేసినట్లు టూటౌన్‌ సీఐ నాగరాజు తెలిపారు. పట్టణంలోని ఖుర్షీద్‌నగర్‌లో భగత్‌ కై లాస్‌ ఇంట్లో గురువారం పేకాడుతుండగా దాడిచేసి పట్టుకున్న ట్లు పేర్కొన్నారు. వారి నుంచి రూ.1,680 నగదు, ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి1
1/2

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి2
2/2

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement