
ఆవు దాడిలో పలువురికి గాయాలు
ఇంద్రవెల్లి: ఆవు దాడిలో పలువురికి గాయాలయ్యాయి. ప్రత్యక్ష సాక్షులు, స్థానికులు తెలిపిన వివరాలు.. మండలకేంద్రంలో సంచరిస్తున్న ఆవు పిచ్చికుక్క దాడికి గురైంది. గురువారం రహదారిపై వెళ్లేవారు, పాఠశాలకు వెళ్తున్న చావన్ గోలు(12), మతిస్థిమితం లేని కమలపై ఆవు దాడి చేసి గాయపర్చింది. కొందరిపై దా డికి యత్నించింది. గాయాలైన వారిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. వి షయం తెలుసుకున్న పంచాయతీ అధికారులు.. ఆవును బంధించి ఊరి బయటకు తీసుకెళ్లి చెట్టుకు కట్టేశారు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.