
అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి
భైంసాటౌన్/బాసర: భైంసాలోని అంబేద్కర్‌నగర్ కు చెందిన ఆగ్రే అక్షయ్ (27) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. బాసర సీఐ టి.సాయికుమార్ కథనం ప్రకారం.. అక్షయ్ గురువారం సాయంత్రం బాసర వై పు నుంచి భైంసాకు వస్తుండగా టాక్లి వద్ద గు ర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న అక్షయ్‌కు తీవ్ర గాయాలు కాగా, గమనించిన స్థానికులు అంబులెన్స్‌లో భైంసాలోని ప్రభుత్వ ఏరియాస్పత్రికి తరలించారు. కాగా, అప్పటికే అక్షయ్ మృతి చెందినట్లు వై ద్యులు ధ్రువీకరించారు. అక్షయ్ మూడేళ్ల క్రి తం ప్రేమ వివాహం చేసుకోగా, పులేనగర్‌లో నివాసముంటున్నాడు. అతని మృతిపై కుటుంబీకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.