
రూ.19.60 లక్షలు పట్టివేత
కోటపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌లో భాగంగా మండలంలోని పార్‌పల్లి సమీపంలోని అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద గురువారం నిర్వహించిన తనిఖీల్లో రూ.19.60 లక్షలు పట్టుకున్నట్లు ఎస్సై రాజేందర్ తెలిపారు. మహారాష్ట్రలోని సిరోంచా తాలుకాకు చె ందిన నిఖిల్‌చందర్ గడ్చిరోలికి కారులో వెళ్తున్నా డు. ఎలాంటి ఆధారాలు, పత్రాలు లేకుండా రూ. 19.60లక్షలు తరలిస్తుండగా కారు తనిఖీ చేశారు. నగదును సీజ్ చేసి కోటపల్లి తహసీల్ధార్ రాఘవేందర్‌రావుకు అప్పగించినట్లు ఎస్సై రాజేందర్ తెలి పారు. రెవెన్యూ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.