భైంసారూరల్: మండలంలోని మాటేగాం గ్రామంలో చోరీ జరిగింది. ఎస్సై శంకర్, బాధితులు తెలిపిన వివరాలు.. వెంకట్‌రెడ్డి, రాజు పటేల్, శ్రావణ్‌రెడ్డి.. మందులు, ఫొటోస్టోడియో దుకాణాలను బుధవారం రాత్రి మూసివేసి ఇంటికి వెళ్లారు. గురువారం ఉదయం వెళ్లి చూడగా కౌంటర్ తీసి ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని సీసీపుటేజీలను పరిశీలించారు. దుకాణం ఒకవైపు రేకు తొలగించి దుండగుడు లోనికి చొరబడ్డాడు. కౌంటర్‌లో రూ.1500 ఎత్తుకెళ్లాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.