
జీఎస్టీ 2.0పై అవగాహన ఉండాలి
మంచిర్యాలటౌన్: కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 2.0ను అమల్లోకి తీసుకొచ్చిందని, దీనిపై వ్యాపారులకు పూర్తి అవగాహన ఉండాలని మంచిర్యాల సెంట్రల్ జీఎస్టీ విభాగాధికారి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్ టీవీ.రమణారెడ్డి అన్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో గురువారం జిల్లాలోని వ్యాపారులకు మంచిర్యాలలోని ఓ ఫంక్షన్ హాల్‌లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఎస్టీ పన్ను స్లాబుల మార్పును వివరించాలని తెలిపారు. అనంతరం వ్యాపారుల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. కార్యక్రమంలో జీఎస్టీ సూపరింటెండెంట్ అమన్‌రాజ్, ఇన్‌స్పెక్టర్ వసంత్, చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు పాల్గొన్నారు.