
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక
మంచిర్యాలఅర్బన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో పట్టణంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో మంగళవారం నిర్వహించిన ఉ మ్మడి జిల్లా అండర్–19 కబడ్డీ పోటీల్లో 120 మంది క్రీడాకారులు పాల్గొనగా అత్యుత్తమ ప్రతిభ కనబ ర్చిన 15 మందిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేసినట్లు కా ర్యదర్శి బాబూరావు తెలిపారు. ఈ నెల 10 నుంచి 12 వరకు మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేటలో జరుగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. ఎంపికై న క్రీడాకారులను డీఐఈవో అంజయ్య అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బుచ్చయ్య, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, యాకూబ్, హిందూ ఉత్సవ సమితి అ ధ్యక్షుడు రాజ్‌కిరణ్, ఆర్టీఏ మెంబర్ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకుడు నరేశ్, తదితరులు పాల్గొన్నారు.