
అలరించిన సైన్స్ డ్రామా పోటీలు
మంచిర్యాలఅర్బన్: జిల్లా సైన్స్ సెంటర్‌లో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ డ్రామా పోటీలు అలరించాయి. ఈ సందర్భంగా డీఈవో యాదయ్య మాట్లాడుతూ సైన్స్ డ్రామాలు శాస్త్ర సాంకేతికతను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఎంతో దోహదపడుతాయని అన్నారు. వివిధ పాఠశాలల నుంచి 80 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్మెల్ హైస్కూల్ విద్యార్థులు ప్రథమ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముత్యంపల్లి విద్యార్థులు ద్వితీయ, జన్నారం స్లేట్ స్కూల్ విద్యార్థులు మూడో స్థా నంలో నిలిచారు. నాటక ప్రదర్శనలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. హరిత సాంకేతిక గ్రీన్ టెక్నాలజీ అంశంపై నాటక ప్రదర్శనతో మొదటి స్థానంలో నిలిచిన కార్మెల్ విద్యార్థులు హైదరాబాద్‌లో ఈ నెల 17, 18న నిర్వహించే సైన్స్ డ్రామా పోటీల్లో పాల్గొననున్నారు. న్యాయనిర్ణేతలుగా జనార్థన్, రాజన్న, అర్చన వ్యవహరించారు. జిల్లా సైన్స్ అధికారి రాజగోపాల్, సెక్టోరల్ అధికారి చౌదరి, నస్పూర్ ఎంఈవో పద్మజా, వివిధ పాఠశాలల గైడ్ టీచర్లు పాల్గొన్నారు.