
నగరంలో మురికి నీరు సరఫరా
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరంలోని పలు కాలనీల్లో ప్రజలకు మురికి నీరు సరఫరా అవుతోంది. రంగు మారిన, మురికిగా ఉన్న నీరు వస్తుండడంతో తాగునీరు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రతీ రోజు వర్షం కురుస్తుండడం, కాలనీల్లో వరద పారుతుండడం, తాగునీటి పైపుల్లోకి బురద చేర డం వల్ల కలుషితమవుతోంది. పైపులైన్ లీకేజీలను సరి చేస్తున్నా ఏదో ఒక కాలనీలో మురికి నీరే సరఫరా అవుతోంది. పాతమంచిర్యాల, మజీద్‌వాడ, హమాలీవాడలోని కొన్ని ప్రాంతాల్లో కొన్ని రోజు లుగా తాగునీరు బురద రంగులో వస్తోంది. కలు షిత నీటిని తాగడం వల్ల రోగాల బారిన పడే ప్రమా దం ఉండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముల్కల్ల గోదావరి నది వద్ద ఫిల్టర్ బెడ్ నుంచి మంచిర్యాలకు తాగునీరు సరఫరా చేస్తున్నా రు. నగరంలో దాదాపు 16వేలకు పైగా నల్లా కనెక్ష న్లు ఉండగా నీటి సరఫరాకు ఏర్పాటు చేసిన పైపులై న్లు అక్కడక్కడ లీకేజీలు ఏర్పడుతున్నాయి. బురద నీరు చేరి నల్లాల ద్వారా ఇళ్లకు సరఫరా అవుతోంది.
ఫిల్టర్‌బెడ్‌లలో శుద్ధి చేసినా..
ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిని ముల్కల్ల వద్ద ఉన్న ఫిల్ట ర్‌బెడ్, మిషన్ భగీరథ పంప్‌హౌజ్‌లో శుద్ధి చేసి సరఫరా చేస్తున్నారు. నస్పూరు ప్రాంత ప్రజలకు సింగరేణి ఫిల్టర్‌బెడ్, గోదావరి నదిలో నిర్మించిన పంప్‌హౌజ్ నుంచి సరఫరా చేపడుతున్నారు. ఫిల్టర్‌బెడ్‌ల వద్ద నీటిని పూర్తిగా శుద్ధి చేసి తాగునీటి ట్యాంకులకు సరఫరా చేసే క్రమంలోనే లీకేజీలతో కలుషితంగా మారుతోంది. మరికొన్ని ప్రాంతాల్లో తాగునీటి ట్యాంకుల నుంచి నల్లాల ద్వారా ఇళ్లకు సరఫరా చేసే క్రమంలో లీకేజీ పైపుల్లోకి బురద చేరి రంగు మారుతున్నట్లు అధికారులు గుర్తించారు. వర్షం కారణంగా లీకేజీలు సరి చేయడం, పైపులైన్ల వద్ద పనులు చేపట్టడం ఇబ్బందిగా మారుతోంది. ఈ విషయమై కార్పొరేషన్ ఇంజినీర్ రాజేందర్‌ను సంప్రదించగా.. కొన్ని కాలనీల్లో పైపులైన్ లీకేజీ వల్ల నీరు రంగు మారి వస్తున్నట్లు ఫిర్యాదులు అందిన వెంటనే సరి చేసి శుద్ధమైన తాగునీరు అందిస్తున్నామని తెలిపారు.