
దరఖాస్తులు అధికంగా వచ్చేలా కృషి చేయాలి
మంచిర్యాలక్రైం: మద్యం టెండర్ల దరఖాస్తులు అధిక సంఖ్యలో వచ్చేలా కృషి చేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ రఘురామ్ అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని మద్యం దుకాణాల టెండర్ల దరఖాస్తుల కేంద్రాన్ని బుధవారం ఆయన సందర్శించారు. జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి నందగోపాల్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ టెండర్ల దాఖలుకు వచ్చిన వారితో మర్యాదపూర్వకంగా మాట్లాడాలని, అవసరమైన సమాచారం అందించాలని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అన్నారు. జిల్లాలో 73 మద్యం దుకాణాలకు గాను బుధవారం వరకు 14 దరఖాస్తులు వచ్చాయని, ఈ నెల 18 వరకు గడువు ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎకై ్సజ్ సీఐలు గురువయ్య, ఇంద్రప్రసాద్, హరి, సమ్మయ్య, ఎస్సైలు పాల్గొన్నారు.