పులుల గణనపై అటవీ సిబ్బందికి శిక్షణ | - | Sakshi
Sakshi News home page

పులుల గణనపై అటవీ సిబ్బందికి శిక్షణ

Oct 9 2025 2:59 AM | Updated on Oct 9 2025 2:59 AM

పులుల గణనపై అటవీ సిబ్బందికి శిక్షణ

పులుల గణనపై అటవీ సిబ్బందికి శిక్షణ

జన్నారం: జన్నారం అటవీ డివిజన్‌ కేంద్రంలో పులుల గణన సర్వేపై బుధవారం అటవీ సిబ్బందికి ఎఫ్‌డీవో రామ్మోహన్‌ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. డివిజన్‌లోని సిబ్బందికి ఎఫ్‌డీవోతోపాటుగా ఫారెస్ట్‌ ఫీల్డ్‌ బయోలజిస్టు ఎల్లం శాఖాహార, మాంసాహార జంతువులను లెక్కించడంపై సూచనలు చేశారు. మూడు రోజులు మాంసాహార జంతువుల గణన ట్రయల్‌ రన్‌, మరో మూడు రోజులు ట్రాజెక్ట్‌ లైన్‌లో శాఖాహార జంతువుల సర్వే చేయాలని తెలి పారు. జంతువుల అడుగులు, మలం, వెంట్రుకలు, చెట్లపై పడిన గోర్ల ఆనవాళ్లు, నేరుగా చూడడం ద్వారా వన్యప్రాణులను లెక్కించాలని సూచించారు. ఈ సమావేశంలో రేంజ్‌ అధికారులు శ్రీధరచారి, సుష్మారావు, మమత, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement