
ఎన్నికల్లో సత్తా చాటాలి
జన్నారం: స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితీశ్‌రాథోడ్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో పార్టీ మండలాధ్యక్షుడు మధుసూదన్‌రావు అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు గెలిచేవారినే ఎంపిక చేయాలని సూచించారు. కేంద్ర ప్రభు త్వ పథకాలు, ప్రధాని మోదీ పాలన గురించి ప్రజలకు వివరించాలని కోరారు. కాంగ్రెస్, బీ ఆర్‌ఎస్‌కు ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు లేదని పేర్కొన్నారు. పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్ హయాంలో బిల్లుల రాక పలువురు సర్పంచులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలున్నాయని ఆరోపించారు. హామీలు నెరవేర్చకుండా దొంగనాటకాలు ఆడుతున్న కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని సూచించారు. జిల్లా కార్యదర్శి కొంతం శంకరయ్య, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షు డు బద్రినాయక్, నాయకులు చంద్ర, రమేశ్, తిరుపతినాయక్, గోపాల్ తదితరులున్నారు.