
మెడికో.. స్నేహ వారధి..
● వైద్య విద్యార్థుల ఫౌండేషన్ ● ప్రతీనెల సేవా కార్యక్రమాలు ● స్నేహాన్ని పెంపొందించుకునేలా కార్యక్రమాలు
ఏడో తరగతి నుంచి
భైంసా: 7వ తరగతి గదిలో ప్రారంభమైన స్నేహబంధాన్ని పట్టణానికి చెందిన లాగేట్‌వార్ శ్రీనివాస్, పల్సి గజ్జారాంలు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. సాయిబాబానగర్‌కు చెందిన శ్రీనివాస్ డిజిటల్ సౌండ్ సిస్టం షాప్ ఉండగా, పల్సి గజ్జారాం ఆటో నడుపుతున్నాడు. కుటుంబ సభ్యులకు కష్టాలు వచ్చినా ఇద్దరు కలిసి చర్చించుకుంటారు. 27 ఏళ్లుగా స్నేహబంధాన్ని కొనసాగిస్తున్నారు.
రెండేళ్లకోసారి
గెట్ టు గెదర్
చెన్నూర్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం అమ్మనగుర్తిలో
దేవేందర్‌రావు (ప్రస్తుత చెన్నూ ర్ సీఐ) ఐదో తరగతి చదువుతున్నప్పడు మిల్కూరి రవీందర్‌రెడ్డి, మొర్రె ఓదెలు స్నేహితులు. ఓదెలు ప్రజాప్రతినిధి కాగా, రవీందర్‌రెడ్డి స్వగ్రామంలో వ్యవసాయం చేస్తున్నాడు. వీరి స్నేహం 30 ఏళ్లకు పైగా కొనసాగుతోంది. ఎక్కడ ఉన్నా శుభకార్యాల్లో ముగ్గురు కలిసి వెళ్తా రు. రెండేళ్లకోసారి గెట్ టూ గెద ర్ ఏర్పాటు చేసి చిన్ననాటి మి త్రులందరినీ కలుసుకుంటారు.
30 ఏళ్లుగా..
భైంసా మండలం తిమ్మాపూర్‌కు చెందిన అ నంతుల నిఖిల్ ముద్దోళ్ల గణేశ్ చిన్నతనం నుంచే స్నేహితులు. గణేశ్ భైంసాలో సీడ్స్, ఫర్టిలైజర్ షాప్ ఉండగా, నిఖిల్ భైంసాలోని నిఖిల్ రెస్టారెంట్ నడుపుతున్నాడు. 30 ఏళ్లుగా స్నేహ ం కొనసాగుతూనే ఉంది. రోజు ఇంటి నుంచి కలిసి వచ్చి తిరిగి కలిసే ఇంటికి వెళ్తారు.
ఈ బంధం విడదీయలేనిది
భైంసా: పట్టణానికి చెందిన పిప్పెర కృష్ణ, తోట రాము 40 ఏళ్లుగా స్నేహబంధాన్ని కొనసాగిస్తున్నారు. తానూరు మండలం బోసి గ్రామానికి చెందిన పిప్పెర గజ్జారాం భైంసాకు వచ్చి స్థిరపడ్డాడు. భట్టిగల్లిలో పెరిగిన పిప్పెర కృష్ణ, తోట రాముతో కలిసి చదువుకున్నాడు. క్రికెట్ ఆడుతూ యువజన సంఘం ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు కొనసాగించాడు. భైంసా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పనిచేసిన పిప్పెర కృష్ణ తన చిన్ననాటి స్నేహితుడు తోట రామును మరిచిపోలేదు. పట్టణంతోపాటు చుట్టూపక్కల ఏ పని ఉన్న ఇద్దరు మిత్రులు కలిసే వెళ్తారు. ఈ స్నేహబంధం ఇప్పటికి ఎవరు విడదీయలేనిది.
ఆపదలో అండగా ‘సోపతిమిత్ర’
నెన్నెల: నెన్నెల మండలం చిన్నవెంకటాపూర్‌కు చెందిన ఉపాధ్యాయుడు జలంపల్లి శ్రీనివాస్ తన ఆలోచనతో సోపతి వెల్ఫేర్ సొసైటీకి పునాది వేశారు. జైపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో 1998–99 బ్యాచ్ పదో తరగతి వరకు చదువుకున్న మిత్రులు రాజబాబు, సాంబశివ, రాచర్ల శ్రీనివాస్, నీలాల శ్రీనివాస్, కృష్ణ, రవికిషన్, నారాయణ, తిరుపతితో కలిసి మొత్తం 110 మంది స్నేహితులతో ఈ సొసైటీని ఏర్పాటు చేశారు. మిత్రులకు ఏ ఆపద వచ్చిన అందరూ కలిసి వాట్సాప్ గ్రూపుల్లో చర్చించుకుని వారి సమస్యలను పరిష్కరించుకుంటున్నారు. ఐదేళ్ల నుంచి ఇప్పటివరకు రూ.6 లక్షలకుపైగా ఆర్థిక సాయం అందిస్తూ వస్తున్నారు. ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు రక్తదానం, రక్తహీనతతో బాధపడుతున్న తలసేమియా బాధితులకు రక్తం కావాలన్నా మేమున్నామంటున్నారు. పలు సేవా కార్యక్రమాలతో పాటు ఆర్థికసాయం అందిస్తూ అభాగ్యులకు అండగా నిలుస్తున్నారు.
కష్టసుఖాల్లో తోడునీడగా..
సాత్నాల: భోరజ్ మండలం మాండగడలో ఆత్రం వామన్ (జూనియర్ అసిస్టెంట్), షేక్ సలీం (ఆర్‌ఎంపీ) మూడో తరగతిలో స్నేహం మొదలైంది. ఆర్థిక పరిస్థితి సరిగా లేక ఆత్రం వామన్ పలు సందర్భాల్లో షేక్ సలీం ఇంట్లో అన్నం తిని పాఠశాలకు వెళ్లేవాడు. తన స్నేహానికి కులం అడ్డు రాదని ఆ గ్రామంలో కృష్ణాలయం నిర్మాణ సమయంలో షేక్ సలీం రూ.25 వేలు విరాళంగా అందించారు. హిందువుల పండుగల వేళ షేక్ సలీం కుటుంబ సభ్యులతో కలిసి వామన్ ఇంటికి వస్తారు. ముస్లిం పండుగలు ఉన్నప్పుడు వామన్ కుటుంబ సభ్యులతో సలీం ఇంటికి వెళ్తారు. 43 ఏళ్లుగా ఒకరికొకరు కష్టాల్లో పాలుపంచుకుంటూ తమ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు.
సేవల్లో టాప్
ముధోల్ మండలం ముద్గల్ గ్రామానికి చెందిన యువకులంతా సేవా కార్యక్రమాల్లో ముందు ఉంటున్నారు. గ్రామానికి చెందిన స్నేహితులంతా ఒకే చోట కలిసి అభివృద్ధిని కొనసాగిస్తున్నారు. జాతీయ రహదారికి 3 కి.మీ దూరంలో ఈ గ్రామం ఉంది. గ్రామంలో స్నేహితులంతా కలిసి శ్రమదానంతో రోడ్లు వేశారు. యువ భారత్ ఆధ్వర్యంలో శుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. తాజాగా ప్రధాన రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. స్వయం ఉపాధితో కుటుంబాలను పోషించే ఈ స్నేహితుల బృందం ముద్గల్ గ్రామ అభివృద్ధికి పాటుపడుతోంది.
స్నేహం వారి బలం
కెరమెరి(ఆసిఫాబాద్): కెరమెరికి చెందిన తిరుపతి గిత్తే, రమేశ్ పురి, రాజు పాతాడే, సుదగొనేవార్ మాధవ్, రా థోడ్ సుదర్శన్, తిరుపతి కాగ్నే, విష్ణు కేంద్రె, రాజు చోళే, బాలు తిడ్‌కే స్నేహితులు. వేర్వేరు కుటుంబాల నుంచి వ చ్చినా, మనస్సులు ఒక్కటయ్యాయి. ప్రతీ పనిలో చో దోడు వాదోడుగా ఉంటున్నారు. ప్రతీ పండుగలో ఒక్కటై అన్ని తామే నిర్వహిస్తారు. కొందరు వ్యాపారులు, మరికొందరు విద్యావంతులుగా ఉన్నారు. ఏళ్లుగా ఒకే మాట.. ఒకే బాటపై నడుస్తున్న తొమ్మిదిమంది మిత్రులు స్నేహమేరా జీవితమంటూ తెలియజేస్తున్నారు. ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటున్నారు.
మతాలు వేరైనా..
తాంసి: తాంసికి చెందిన జానకొండ శ్రీకాంత్, వడ్డాడి గ్రామానికి చెందిన అబ్దుల్ అశ్వక్ 6వ తరగతి చదువుతున్నప్పుడు స్నేహితులయ్యారు. 30 ఏళ్లుగా స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. మతాలు వేరైన ఇళ్లలో జరిగే శుభకార్యాలు, కష్టసుఖాల్లో రెండు కుటుంబాలు పరస్పరం కలుసుకుంటాయి. ప్రస్తుతం చేస్తున్న వ్యాపారాల్లో ఒకరికొకరు పనులు చేసుకుంటారు.
19 ఏళ్లుగా స్నేహబంధం
ఆదిలాబాద్‌టౌన్: నేను 2006లో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా చేరాను. ఆ సమయంలో నా స్నేహితురాలు మంజూల కెమిస్ట్రీ లెక్చరర్‌గా పరిచయమైంది. అప్పటి నుంచి మా స్నేహం ముడిపడింది. కళాశాలలో నాలుగేళ్లు పనిచేశాం. 2013లో నేను మహిళా డిగ్రీ కళాశాలకు పదోన్నతిపై వెళ్లగా, నా స్నేహితురాలు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు వెళ్లారు. ఆ తర్వాత నేను ఉట్నూర్‌కు బదిలీపై వెళ్లగా, ఆమె లక్సెట్టిపేట్ డిగ్రీ కళాశాలకు బదిలీ అయ్యారు. అయినప్పటికీ మా స్నేహబంధం కొనసాగుతోంది. 14 ఏళ్ల తర్వాత మళ్లీ ఆమె డిగ్రీ కళాశాలలో ఉండడంతో నేను అదే కళాశాలను ఎంచుకున్నాను. ప్రస్తుతం ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నాను. ఇరు కుటుంబ సభ్యులు కష్టసుఖాల్లోనూ పాలు పంచుకుంటాం. 19 ఏళ్లుగా మా స్నేహం కొనసాగుతుంది.
– సంగీత, ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్
దోస్తులంతా ఉద్యోగులే
తానూరు: మండలంలోని భోసి గ్రామానికి చెందిన చిన్ననాటి మిత్రులు ఒకే చోట విద్యనభ్యసించి ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. 1 నుంచి 10వ తరగతి వరకు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించి 1999లో 10వ తరగతి పూర్తిచేశారు. ఉన్నత చదవులు చదవి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. బి.సుధాకర్ (ప్రభుత్వ టీచర్), పి.గంగాధర్ (సాఫ్ట్‌వేర్), ఎల్.దత్తాత్రి (పీజీటీ టీచర్), ఎ.రాజేశ్వర్ (ఆరోగ్యమిత్ర)గా కొనసాగుతున్నారు.
మంచిర్యాలటౌన్: మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీ మొదటి బ్యాచ్ ఎంబీబీఎస్ విద్యార్థుల సేవాగుణం పలువురికి చేయూతనందిస్తోంది. విద్యార్థుల్లో స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పుతోంది. కళాశాల ప్రిన్సిపాల్ ఎండీ.సులేమాన్ ఆధ్వర్యంలో గవర్నమెంటు మెడికల్ కాలేజీ ఫౌండేషన్, మంచిర్యాల పేరిట ఏర్పాటైంది. 2002లో మొదలైన మెడిసిన్ మొదటి బ్యాచ్ ఆరంభ్, 2023లో ఆరోహణ, 2024 బ్యాచ్ అద్వితీయగా నామకరణం చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతీ విద్యార్థి నెలకు రూ.100 చొప్పున జమ చేసి ఐదు లక్ష్యాలు ఆర్థిక సహాయం, పరిశుభ్రత, ఆరోగ్యం, విద్య, సోషల్ ఆవేర్‌నెస్‌లను ఎంచుకుని సహాయం అందిస్తున్నారు. మార్చి నుంచి జూలై వరకు లక్ష్యాలను పూర్తి చేశారు. ఈ ఏడాది మార్చిలో పేద మెడిసిన్ విద్యార్థికి మూడో సంవత్సరానికి హాస్టల్, కాలేజీ ఫీజు చెల్లించారు. మంచిర్యాలలోని బాలికల పాఠశాల విద్యార్థినులకు న్యాప్‌కిన్స్ అందించి ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. కల్వరి వృద్ధాశ్రమం, ఎన్టీఆర్‌నగర్‌కు చెందిన దివ్యాంగులు ఇద్దరికి రెండు ట్రైసైకిళ్లు అందించారు. లక్సెట్టిపేట, హాజీపూర్, మంచిర్యాల మండలాల్లో విద్యార్థులకు పుస్తకాలు, నోట్‌బుక్స్, పెన్నులు, క్రీడాసామగ్రి అందజేశారు.
ఆత్మీయ బంధాల సౌరభం స్నేహం కష్టసుఖాల్లో తోడుండేవాడు మిత్రుడు నిజమైన మిత్రులే గొప్ప ఆస్తి నేడు స్నేహితుల దినోత్సవం
ఆస్తులు సంపాదించినవాడు కాదు, ఆప్తులను సంపాదించినవాడే నిజమైన అదృష్టవంతుడు. స్నేహితుడు.. ఎవరి సమక్షంలో బాధలు సగానికి సగమై, ఆనందం రెట్టింపవుతుందో, ప్రపంచంలో ఎవరూ విడిచిపెట్టినా నీవు ఒంటరి కాకుండా తోడుంటారో, వారే నిజమైన మిత్రులు. స్వచ్ఛమైన స్నేహం ఒక అపురూప దివ్యమణి, హృదయాలను అనుసంధానం చేసే ఆత్మీయ వారధి. ఆధునిక కాలంలో యాంత్రిక జీవనం, ఆర్థిక సంబంధాల మధ్య స్వార్థం లేని స్నేహం కోసం తపించే హృదయాలెన్నో.. అయినా, చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడం, గత జ్ఞాపకాలు నెమరువేసుకోవడం ఆ హృదయాలకు ఊరటనిస్తుంది. సాంకేతికత స్నేహబంధాలకు కొత్త ఊపిరి పోసింది. ఫేస్‌బుక్, వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాలు దూరమైన మిత్రులను దగ్గర చేశాయి. ట్రెండ్ మారినా.. నిజమైన ఫ్రెండ్ మారలేదు. నేడు ప్రపంచ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆప్తమిత్రులపై ప్రత్యేక కథనం.

మెడికో.. స్నేహ వారధి..

మెడికో.. స్నేహ వారధి..

మెడికో.. స్నేహ వారధి..

మెడికో.. స్నేహ వారధి..

మెడికో.. స్నేహ వారధి..

మెడికో.. స్నేహ వారధి..

మెడికో.. స్నేహ వారధి..

మెడికో.. స్నేహ వారధి..

మెడికో.. స్నేహ వారధి..

మెడికో.. స్నేహ వారధి..

మెడికో.. స్నేహ వారధి..

మెడికో.. స్నేహ వారధి..