
ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి
● రాజ్‌గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు
ఆదిలాబాద్‌రూరల్: ఉమ్మడి జిల్లాలో ఈనెల 9న నిర్వహించే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని రాజ్‌గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లోని ఆయన నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కుమురం భీం జిల్లాలో నిర్వహించే భారీ ర్యాలీ, బహిరంగ సభకు జాతీయ, రాష్ట్ర, అన్ని ఆదివాసీ తెగలు, ఆదివాసీ సంఘాల నాయకులు హాజరవుతారని తెలిపారు. ఆదివాసీలు అధికసంఖ్యలో తరలిరావాలని కోరారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు పంద్రం శంకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆనంద్ రావు, కుమ్ర శ్యామ్‌రావు, జంగు పటేల్, శేష్‌రావు, సునీల్, రాజు, ఉపేందర్, హన్ను పటేల్, విజయ్, మనోహర్, మారుతి, మాణిక్ రావు, సూర్యబాన్, చిత్రు తదితరులు పాల్గొన్నారు.