
వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి
కాసిపేట: పీహెచ్‌సీలో ౖవైద్యులు, వెద్యసిబ్బంది అందుబాటులో ఉండాలని, అత్యవసర పరిస్థితిలో మాత్రమే సెలవులు తీసుకోవాలని డీఎంహెచ్‌వో హరీష్‌రాజ్ సూచించారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీని శనివారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ల్యాబ్, మందులు, వార్డులను పరిశీలించారు. మామిడిగూడలో నిర్వహిస్తున్న వైద్యశిబిరాన్ని సందర్శించారు. ర్యాపిడ్ ఫీవర్ సర్వే, యాంటీ లార్వా ఆపరేషన్‌లు, గ్రామంలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వైద్యసిబ్బంది సూచన మేరకు గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. వై ద్యాధికారి దివ్య, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
పిచ్చికుక్క దాడిలో
ముగ్గురికి గాయాలు
ఆసిఫాబాద్: జిల్లాకేంద్రంలోని బ్రాహ్మణవాడలో శనివారం సాయంత్రం పిచ్చికుక్కల దాడిలో ముగ్గురికి గాయాలయ్యాయి. పట్టణంలోని బెస్తవాడకు చెందిన ముగ్గురు.. కాలనీ మీదుగా వెళ్తుండగా, కుక్క కరిచింది. వెంటనే స్థానిక ప్ర భుత్వాసుపత్రిలో చికిత్స పొందారు. పిచ్చికుక్కల బెడద నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.