
మానవత్వం చాటుకున్న కార్మికులు
● గాయపడ్డ ఎద్దుకు చికిత్స
శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 7 గని కార్మికులు మానవత్వం చాటుకున్నారు. రోడ్డు పక్క న గాయాలతో మూలుగుతున్న ఎద్దును చూసి దా నికి సపర్యాలు చేసి సంరక్షణ కేంద్రానికి తరలించా రు. వర్క్‌షాప్ నుంచి ఆర్కే 7 గనికి వెళ్లేదారిలో మూడురోజుల క్రితం గుర్తుతెలియని వాహనం ఓ ఎద్దును ఢీకొట్టి గాయపర్చింది. కాళ్లకు తీవ్ర గా యమై రక్తస్రావం జరగడంతో కదలకుండా అక్కడే పడి ఉంది. శనివారం ఉదయం డ్యూటీకి వెళ్లే కార్మి కులు గమనించి రామకృష్ణపూర్‌కు చెందిన పశుసంరక్షణ కేంద్ర నిర్వాహకులు శ్రీధర్, రాజసమ్మయ్య సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకో గా దాన్ని తరలించడం ఇబ్బందిగా మారింది. కా ర్మికులు.. ఏజెంట్ శ్రీధర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఏరియా జీఎం ఎం.శ్రీనివాస్‌కు చెప్పడంతో ఆయన ఆదేశాలతో ఏరియా వర్క్‌షాప్ డీజీఎం రవీందర్ క్రేన్, వాహనాన్ని సమకూర్చారు. ఎద్దును లారీలో ఎక్కించి సంరక్షణ కేంద్రానికి తరలించి వైద్యం అందిస్తున్నారు. గని కార్మికులు మారుపల్లి సారయ్య, నాగరాజ్, రాజ్‌కుమార్, చిలుక రమేశ్ పాల్గొన్నారు.