
యువకుడి అదృశ్యం
బోథ్: మండల కేంద్రానికి చెందిన ఉష్కెల దశరథ్(30) అదృశ్యమయ్యారు. ఎస్సై శ్రీసాయి తెలిపిన వివరాల ప్రకారం.. దశరథ్ కొన్నినెలలుగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాసీ్త్రనగర్‌లో కూరగాయాలు అమ్ముతూ కుటుంబంతో కలిసి జీవించేవాడు. అతని భార్య శైలజకు ఆర్యోగం బాగా లేకపోవడంతో గతనెల 13న స్వంత గ్రామమైన బోథ్‌కు వచ్చాడు. ఐదురోజుల క్రితం భార్యను నేరడిగొండలోని తన పుట్టింటికి వెళ్లింది. దశరథ్ గతనెల 31న నిర్మల్ వెళ్లి వస్తానని తల్లి లక్ష్మితో చెప్పి వెళ్లాడు. రెండు రోజులైన తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం వెతికిన దొరకలేదు. భార్య శైలజ ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.