
‘బనకచర్ల’తో అన్యాయం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనకచర్ల లింకు ప్రాజెక్టుతో తెలంగాణకు గోదావరి నీటి వాటాలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని బీఆర్‌ఎస్ నాయకులు అన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా కేంద్రం నస్పూర్‌లో ఉన్న పార్టీ కార్యాలయంలో విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అధ్యక్షతన గోదావరి–బనకచర్ల లింకు ప్రాజెక్టు రద్దు కోసం తెలంగాణ విద్యార్థి సదస్సు నిర్వహించారు. సాగునీటి రంగ నిపుణులు వి.ప్రకాశ్‌రావు ప్రాజెక్టు నిర్మాణం, నీటి తరలింపు తదితర అంశాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కృష్ణా జలాల మాదిరే గోదావరి జలాలను తీసుకుపోయేందు కు కుట్రపన్నారని తెలిపారు. ఏపీ ప్రభుత్వ చర్యతో నీటిలో హక్కులు కోల్పోయి భవిష్యత్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంద ని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో బనకచర్ల పై చర్చ జరగలేదని చెబితే.. ఏపీ సాగునీటి శా ఖ మంత్రి నిమ్మల రామనాయుడు చర్చ జరి గిందని అంటున్నారని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డికి అన్నింటిలో ఏపీ సీఎం చంద్రబాబు అండగా ఉండడంతోనే ఈ ప్రాజెక్టుకు అడ్డుచెప్పడం లేదని, దీనిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఫియర్ కుంగితేనే అంతా అయిపోయిందని తప్పుడు ప్రచా రం చేస్తున్నారన్నారు. ఈ సదస్సులో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, చిన్నయ్య, బీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, నాయకులు విజిత్‌రావు, రాజారాం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు
మంచిర్యాలలో విద్యార్థి సదస్సు

‘బనకచర్ల’తో అన్యాయం