మహిళా సిబ్బంది అన్ని విధులు నిర్వర్తించాలి | - | Sakshi
Sakshi News home page

మహిళా సిబ్బంది అన్ని విధులు నిర్వర్తించాలి

Aug 2 2025 6:44 AM | Updated on Aug 2 2025 6:44 AM

మహిళా సిబ్బంది అన్ని విధులు నిర్వర్తించాలి

మహిళా సిబ్బంది అన్ని విధులు నిర్వర్తించాలి

● పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌ అభిలాష్‌బిస్త్‌

నస్పూర్‌: పురుషులతో సమానంగా మహిళా సిబ్బంది అన్ని విధులు నిర్వర్తించాలని ఆర్‌బీవీఆర్‌ఆర్‌(రాజా బహదూర్‌ వెంకటరమణారెడ్డి) పోలీసు అకాడమీ డైరెక్టర్‌ అభిలాష్‌ బిస్త్‌ అన్నారు. శుక్రవారం ఆమె సీసీసీలోని సింగరేణి గెస్ట్‌హౌస్‌లో మంచిర్యాల జోన్‌ పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. డీసీపీ, ఏసీపీ, ఎస్‌హెచ్‌ఓ, మహిళా సిబ్బందితో మాట్లాడుతూ డ్యూటీలు, పోస్టింగ్‌లు, సెలవులు, పని ప్రదేశంలో సమస్యలు, కుటుంబ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పోలీస్‌ శిక్షణ సమయంలో పురుషులతో సమానంగా మహిళా సిబ్బంది అన్ని విభాగాల్లో శిక్షణ తీసుకుంటున్నారని, విధుల నిర్వహణలో మాత్రం తారతమ్యం చూపిస్తున్నారని అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌ ప్రోగ్రాం, బ్లూకోట్స్‌, నైట్‌డ్యూటీలు, మెడికల్‌ డ్యూటీలు, వెహికిల్‌ చెకింగ్‌, క్రైమ్‌, ఎస్కార్ట్‌, ట్రాఫిక్‌, బందోబస్తు వంటి అన్ని విధులు పురుషులతో సమానంగా నిర్వర్తించాలని సూచించారు. మహిళా సిబ్బందికి డ్రైవింగ్‌లో శిక్షణ ఇప్పించాలని పేర్కొన్నారు.

ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి

శ్రీరాంపూర్‌: పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని పోలీసు అకాడమీ డైరెక్టర్‌ అభిలాష్‌ బిస్త్‌ తెలిపారు. శుక్రవారం ఆమె శ్రీరాంపూర్‌ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. రిసెప్షన్‌ సెంటర్‌, లాకప్‌, స్టేషన్‌ గదులు, బ్యారెక్స్‌, టెక్నికల్‌ రూం, పరిసరాలు పరిశీలించారు.

దుర్గాదేవి ఆలయంలో పూజలు

మంచిర్యాలక్రైం: మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధి ఏసీసీ క్వారీ దుర్గాదేవి ఆలయంలో దుర్గామాతను అకాడమీ డైరెక్టర్‌ అభిలాష్‌బిస్త్‌ శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆలయ విశిష్టతను వివరించారు. అమ్మవారి తీర్థప్రసాదాలు అందించి శేషవస్త్రంతో సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో డీసీపీ భాస్కర్‌, మంచిర్యాల, జైపూర్‌, బెల్లంపల్లి ఏసీపీలు ప్రకాశ్‌, వెంకటేశ్వర్లు, రవికుమార్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ ఏసీపీ మల్లారెడ్డి, సీఐలు ప్రమోద్‌రావు, అశోక్‌కుమార్‌, ఎస్సైలు సంతోష్‌, లక్ష్మీప్రసన్న పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement