
టీచర్ల పదోన్నతుల ప్రక్రియ షురూ
● నేడు సీనియారిటీ జాబితా ప్రదర్శన
మంచిర్యాలఅర్బన్: సర్కారు పాఠశాలల ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. టీచర్ల సీనియార్టీ జాబితా వడపోత కార్యక్రమంలో అధికార యంత్రాంగం తలమునకలైంది. ఎస్జీటీలతోపాటు భాషా పండితుల్లో అర్హులైన సీనియర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా, భాషా పండితులకు గ్రేడ్–1 పదోన్నతులు లభించనున్నాయి. స్కూల్ అసిస్టెంట్లకు సీనియార్టీ ప్రకారం పీజీహెచ్‌ఎంలుగా అవకాశం రానుంది. పదోన్నతుల సీనియార్టీ జాబితా తయారీకి డీఈవో యాదయ్య నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. ఎంఈవో, పీజీహెచ్‌ఎం, కంప్యూటర్ సహాయకులు ఇందులో ఉన్నారు. ఒక్కో పదోన్నతికి ముగ్గురి(1ః3) పేర్లు సూచించనున్నారు. జీహెచ్‌ఎంల సీనియార్టీ జాబితాను ఆర్జేడీ కార్యాలయానికి పంపించనున్నారు. జిల్లాలో 25మంది వరకు స్కూల్ అసిస్టెంట్లు జీహెచ్‌ఎంలుగా, సీనియర్ ఎస్జీటీల్లో 100 నుంచి 110మంది స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందనున్నారు. సోషల్, బయోలజీ విభాగాల్లో ఎక్కువ మందికి అవకాశాలు రానున్నట్లు తెలుస్తోంది. పదోన్నతుల సీనియార్టీ జాబితాను శనివారం ప్రదర్శించనున్నారు. జీరో ఎన్‌రోల్‌మెంట్ స్కూళ్లతో ఉపాధ్యాయుల ఖాళీల జాబితా అటుఇటుగా మారే అవకాశాలున్నాయి.
కేటగిరీ వారీగా ఖాళీలు
పోసు లోకల్‌బాడీ ప్రభుత్వ ఖాళీలు
పాఠశాల
జీహెచ్‌ఎం 25 2 27
పీఎస్‌హెచ్‌ఎం 26 01 27
బయోసైన్స్ 12 03 15
ఇంగ్లిష్ 06 03 09
హిందీ 15 01 16
సోషల్ 23 04 27
తెలుగు 15 01 16