● గురువు లేకుండానే సాధన
● జాతీయ, రాష్ట్ర స్థాయిలో పురుషోత్తముడి సత్తా
నవాబుపేట: యోగాలో పురుషోత్తంకు ప్రత్యేక రికార్డు ఉంది. ఏకంగా మూడు పర్యాయాలు జాతీయ పోటీలకు ఎంపికై , 8 సార్లు రాష్ట్ర స్థాయి మొదటి బహుమతులు సాధించారు. ఎంత కష్టమైన ఆసనాలైన సులువుగా చేయగల సమర్థుడు. గురువు లేకుండానే కేవలం టీవీలో చూడటం, పుస్తకాలు చదవటంతో ఆసనాలు వంట పట్టించుకుని పురుషోత్తం గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఏకలవ్యుడిగా ఎదిగారు. దీంతో పాటు ఆయన భార్య, పిల్లలు సైతం యోగాల్లో రాటుదేలారు.
● నవాబుపేట మండలంలోని మరికల్ గ్రామానికి చెందిన పురుషోత్తం గురువు లేకుండానే యోగాలో అగ్రస్థాయికి ఎదిగాడు. తనతో పాటు భార్య నిర్మల, కుమార్తె ఝాన్సీరాణి, కుమారుడు చరణ్‌కు సైతం యోగాలో తానే శిక్షణ ఇచ్చి, వారిని నెపుణ్యంగల వారిగా తయారు చేశాడు. దీంతో ఆయన కుటంబమే యోగా కుటుంబంగా మారింది. ఇప్పటికే ఆయన కుమార్తె, కుమారుడు పాఠశాల, కళాశాల నుంచి జిల్లా స్థాయి పథకాలు సాధించారు. బార్య మరికల్‌లో మహిళలకు యోగా నేర్పుతుండగా.. పురుషోత్తం మండల కేంద్రంలో రెండేళ్లుగా యోగా ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.
సాధించిన పథకాలు
● 2014లో యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పోటీల్లో పాల్గొని రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతి.
● 2015లో నిజామాబాద్‌లో రాష్ట్ర స్థాయి ద్వితీయ పతకం.
● 2016లో మరోసారి రాష్ట్ర స్థాయి బంగారు పతకం
పొందాడు.
● 2016లో జరిగిన దక్షణ భారతదేశ జాతీయ స్థాయి పోటీల్లో 8 రాష్ట్రాలు పాల్గొనగా.. వాటిలో మొదటి బహుమతి సాధించి బంగారు పతకం పొందాడు.
● 2017–18 సంవత్సరంలో జాతీయ స్థాయి పోటీలో నాల్గో స్థానం సాధించాడు.


