లైంగికదాడి కేసులో పదేళ్ల జైలుశిక్ష | - | Sakshi
Sakshi News home page

లైంగికదాడి కేసులో పదేళ్ల జైలుశిక్ష

Jun 20 2026 11:31 AM | Updated on Jun 20 2026 11:31 AM

మహబూబ్‌నగర్‌ క్రైం/హన్వాడ: మండలంలో ని సల్లోనిపల్లికి చెందిన అతినమోని వెంకట య్య 2023లో ఓ మహిళపై లైంగికదాడికి పా ల్పడినట్లు కేసు నమోదైంది.ఈకేసుపై సుదీర్ఘంగా విచారణ జరిపిన మహబూబ్‌నగర్‌ ఫోర్త్‌ అడిషనల్‌ డిస్ట్రిక్‌ సెషన్స్‌ కమ్‌ ఉమెన్స్‌ కోర్టు జడ్జి అఫ్రోజ్‌ శుక్రవారం తుది తీర్పును వెల్లడించారు. నిందితుడు వెంకటయ్యపై మోపబడిన నేరారోపణలు నిజమని సాక్ష్యాధారాలతో నిరూపితం కావడంతో పదేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.5వేలు జరిమానా విధిస్తూ మెజిస్ట్రేట్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అప్పట్లో ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని, పక్కా సాక్ష్యాధారాలతో కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేసిన ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌ పూర్వపు సీఐ స్వామిగౌడ్‌, ఎస్‌ఐ రవినాయక్‌ను ఉన్నతాధికారులు అభినందించినట్లు ఎస్‌ఐ వెంకటేష్‌ తెలిపారు.

విజయ సంకల్ప యాత్ర విజయవంతం చేద్దాం

అలంపూర్‌: విజయ సంకల్ప యాత్రను విజయవంతం చేద్దామని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఓరుగంటి ఆనంద్‌ పిలుపునిచ్చారు. పట్టణంలో జోగులాంబ అమ్మ వారి సన్నిధిలో విజయ సంకల్ప యాత్ర సభ స్థలాన్ని శుక్రవారం రాష్ట్ర కమిటీ సభ్యుల బృందంతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ జోగుళాంబ అమ్మవారి పుణ్య క్షేత్రంలో 29న మహా సంకల్పయాత్ర 101 కార్లతో చేపడుతున్నట్లు తెలిపారు. మహా సంకల్ప సభకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సభ్యులకు దిశా నిర్దేశం చేశారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెనిగె విష్ణువర్ధన్‌, రాష్ట్ర కార్యదర్శి గుమ్మ గోవర్ధన్‌, ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా అధ్యక్షులు గార్లపాడు భూషణం, నియోజకవర్గం అధ్యక్షుడు తుమ్మల రవికుమార్‌, జిల్లా కార్యదర్శి చెన్నుపాటి సుబ్బన్న, ఉద్యమకారులు తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement