భార్య, కుమారుడు, అత్త ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

భార్య, కుమారుడు, అత్త ఆత్మహత్యాయత్నం

Jun 19 2026 12:48 AM | Updated on Jun 19 2026 12:48 AM

చికిత్స పొందుతూ బాలుడి మృతి

కల్వకుర్తి టౌన్‌: ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడి మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కురుమూర్తి గురువారం తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాలిలా.. జిల్లాలోని ఉప్పునుంతల మండలానికి చెందిన శ్రీనుకు వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన లక్ష్మీప్రసన్నతో 2020లో వివాహం జరిగింది. అయితే గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలో లక్ష్మీప్రసన్న భర్తపై కోపంతో రెండేళ్ల క్రితం కూతురు, కుమారుడికి టాయిలెట్‌ క్లీనింగ్‌ యాసిడ్‌ తాగించగా, హైదరాబాద్‌లోని నీలోఫర్‌లో చికిత్స అనంతరం ఇంటికి తీసుకొచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో మళ్లీ భర్తతో గొడవ జరగడంతో పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలోనే గత ఆదివారం లక్ష్మీప్రసన్న, కుమారుడు రిత్విక్‌ (2), లక్ష్మీప్రసన్న అమ్మ తిరుపతమ్మ పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబసభ్యులు గమనించి వెంటనే మహబూబ్‌నగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. రిత్విక్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లో ని నిలోఫర్‌ ఆస్పత్రికి తరలించగా బుధవారం అర్ధరాత్రి చనిపోయాడు. ఘటనపై తండ్రి శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

వనపర్తి రూరల్‌: చెట్టుకు ఉరేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. పట్టణ ఎస్‌ఐ హరిప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని అయిజయ కాలనీకి చెందిన కుమ్మరి బాలవర్దన్‌ (34) ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవాడు. ఈ నెల 13న షాపుకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన అతను తిరిగి రాలేదు. దీంతో అతడి భార్య సునిత అదే రోజు పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో గురువారం మండలంలోని రాజపేట గ్రామ శివారులోని బాపనోని గుట్ట దగ్గర చెట్టుకు ఓ వ్యక్తి ఉరేసుకొని మృతి చెందాడని సమాచారం రావడంతో పోలీసులు వెళి్‌ల్‌ పరిశీలించారు. బాలవర్ధన్‌ కుటుంబసబ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి కుమ్మరి బాలవర్ధన్‌గా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ఆస్పత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

కోస్గి రూరల్‌: ప్రమాదవశాత్తు నిప్పంటుకొని చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందిన ఘటన గుండుమాల్‌లో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. గుండుమాల్‌కు చెందిన ఖాజా(35) మూడునెలల క్రితం ఇంట్లో రాత్రి సమయంలో దీపం కాలుపై పడటంతో శరీరానికి నిప్పు అంటుకున్నది. మంటలను అర్పి కోస్గి ఆస్పత్రికి తరలించగా మెరుగైన వైద్యం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించి గుండుమాల్‌కు తీసుకొచ్చారు. ఏడురోజల క్రితం పరిస్థితి విషమించడంతో మరోమారు జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స పొందుతుండగా కోలుకోలేక బుధవారం రాత్రి మృతిచెందాడు. చిన్నాన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని ఎస్‌ఐ పురుషోత్తం తెలిపారు.

చికిత్స పొందుతూ మహిళ మృతి

వనపర్తి రూరల్‌: చికిత్స పొందుతూ మహిళ మృతి చెందిన ఘటన పెబ్బేరు మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ వెంకటేష్‌ గౌడ్‌ వివరాల ప్రకారం పెబ్బేరు మండలంలోని గుమ్మడం తండాకు చెందిన రుక్మిణి ప్రసన్న(28) అదే గ్రామానికి సేనావత్‌ లక్ష్మిదాస్‌తో ఎనిమిదేళ్ల కిందట వివాహం అయ్యింది. వీరికి కుమారుడు, కూతురు ఉన్నారు. అనుమానంతో అత్తామామ, భర్త ఆమెను శారీరకంగా వేధించారు. ఈ నెల 17న వారి వేధింపులు భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది. గమనించిన కుటుంబసభ్యు లు చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ గురువారం ఉదయం గంటల కు మృతి చెందింది. ఘటనపై మృతురాలి తండ్రి ముడావత్‌ పాప్యనాయక్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేవామని ఎస్‌ఐ తెలిపారు.

ఇసుక లారీలు పట్టివేత

అలంపూర్‌: అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న రెండు లారీలు పట్టుబడినట్లు ఉండవెల్లి ఎస్‌ఐ శేఖర్‌ తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం.. అలంపూర్‌ చౌరస్తా సమీపంలోని 44వ జాతీయ రహదారిపై పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద గురువారం తెల్లవారుజామున కానిస్టేబుల్స్‌ రవి, చంద్రబాబునాయుడు బ్లూకోర్ట్‌ విధులు నిర్వహిస్తుండగా.. తెల్లవారు జామున 4:30 గంటల సమయంలో టోల్‌ప్లాజా వద్ద ఓ లారీ రాగా.. అనుమానం వచ్చి పరిశీలించగా అందులో ఇసుక లోడ్‌ ఉంది. నందికోట్కూరుకు చెందిన నరేష్‌ లారీ డ్రైవర్‌ ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా మంత్రాలయం నుంచి హైదరాబాద్‌కు ఇసుకను తరలిస్తున్నాడు. అదేవిధంగా 5గంటల సమయంలో టోల్‌ప్లాజా వద్దకు మరో లారీ వచ్చింది. దాన్నీ తనిఖీ చేయగా అందులోనూ ఇసుక లోడ్‌ ఉంది. నందికోట్కూరుకు చెందిన లారీ డ్రైవర్‌ రాజేష్‌ ఎలాంటి పత్రాలు లేకుండా మంత్రాలయం నుంచి హైదరాబాద్‌కు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు తెలిపారు. అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న రెండు లారీలపై కానిస్టేబుళ్ల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement