కమనీయం.. రాములోరి కల్యాణం | - | Sakshi
Sakshi News home page

కమనీయం.. రాములోరి కల్యాణం

Jun 18 2026 1:11 AM | Updated on Jun 18 2026 1:11 AM

శ్రీరాముని జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో బుధవారం సీతారాముల కల్యాణ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సీతారాములను సర్వాంగసుందరంగా ముస్తాబు చేసి వేదమంత్రాల నడుమ కల్యాణం జరిపించారు. కల్యాణ కార్యక్రమాన్ని తిలకించేందుకు ఆలయ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు ఉదయాన్నే బీచుపల్లికి చేరుకొని పవిత్ర కష్ణానదిలో పుణ్యస్నానాలను ఆచరించి భక్తిశ్రద్ధలతో సీతారాముల కల్యాణ మహోత్సవంలో పాల్గొని కనులారా తిలకించారు. కల్యాణానికి హాజరైన భక్తులకు ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్‌ సురేందర్‌రాజు, అర్చకులు భువనచంద్ర, దత్తుస్వామి, భానుమూర్తి, పాలక మండలి సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఎర్రవల్లి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement