మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూలో ఆగస్టు 7, 8వ తేదీల్లో నిర్వహించే నేషనల్ సెమినార్‌ను హైదరాబాద్ సమీపంలో నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ రమేష్‌బాబు పేర్కొన్నారు. ఈమేరకు పీయూ అడ్మి నిస్ట్రేషన్ భవనంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమ నిర్వహణ కోసం పలు కమిటీలను ప్రకటించారు. ఇందులో వీసీ శ్రీనివాస్ ప్యాట్రాన్‌గా, రిజిస్ట్రార్ రమేష్‌బాబు కన్వీనర్‌గా, కంట్రోలర్ ప్రవీణ, వీసీ ఓఎస్డీ మధసూదన్‌రెడ్డి కన్వీనర్‌లుగా బాధ్యతలు నిర్వహించనున్నారు. వీరితో పాటు బ్రోచర్‌ల రూపకల్ప, ఆహ్వాన పత్రా ల తయారీ, అకాడమిక్ సెషన్లు, ప్రతినిధుల వసతి, రవాణా, భోజనం, సాంకేతిక సమాచారం, ఆర్థిక వ్య వహారాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, డాక్యుమెంటేషన్ వంటి కార్యక్రమాల కోసం మొత్తం 15 మంది సభ్యులతో కమిటీలను ఏర్పాటు చేస్తున్న ట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో నూర్జహాన్, కిషోర్, కుమారస్వామి, రాజ్‌కుమార్, రవికాంత్ పాల్గొన్నారు.


