కోయిల్‌సాగర్‌తో దేశానికే గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

కోయిల్‌సాగర్‌తో దేశానికే గుర్తింపు

May 20 2026 2:04 AM | Updated on May 20 2026 2:04 AM

దేవరకద్ర: పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటునందిస్తుందని, కోయిల్‌సాగర్‌ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందితే జిల్లా, రాష్ట్రానికే కాకుండా.. దేశానికే గుర్తింపు వస్తుందని కలెక్టర్‌ ఖుష్బూగుప్తా అన్నారు. జిల్లా యువజన, క్రీడలు, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు వద్ద పర్యాటక అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని వాల్‌పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు ఒకపక్క రైతులకు సాగునీటి అందిస్తూ.. మరోపక్క పర్యాటకులను ఆకర్షిస్తుందన్నారు. ప్రాజెక్టులు, చారిత్రక ప్రదేశాలను పిల్లలు సందర్శించడం వల్ల ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా మన పూర్వికుల చరిత్ర, ప్రాజెక్టుల ప్రాముఖ్యత తెలుసుకునే అవకాశం లభిస్తుందన్నారు. జిల్లాలో చారిత్రక, పర్యాటక ప్రాంతాలైన పిల్లలమర్రి, కోయిల్‌సాగర్‌లను సందర్శించాలని కోరారు. పిల్లలు ప్రశ్నించే గుణాన్ని అలవర్చుకుని సందర్శించిన ప్రదేశాల వివరాలను అక్క డి నిపుణులను అడిగి తెలుసుకోవాలని సూచించారు. దీని ద్వారా ఎన్నో కొత్త విషయాలు తెలుసు కునే అవకాశం లభిస్తుందని చెప్పారు. అనంతరం కలెక్టర్‌ కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టును సందర్శించి ఆ యకట్టు, నీటినిల్వ సామర్థ్యం, నీటి వనరుల లభ్య త, పెండింగ్‌ పనులు, మరమ్మతు, సాగు, తాగునీటికి ఎంత వాడుతున్నారనే వివరాలను ఇరిగేషన్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కోయిల్‌సాగర్‌ గ్రామంలోని ఉన్నత పాఠశాలను సందర్శించి ఎస్సెస్సీలో వందశాతం ఉత్తీర్ణత సాంధించినందుకు ఉపాధ్యాయులు, విద్యార్థులను అభినందించారు. పాఠశాలకు ప్రహరీ నిర్మించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ హరిప్రియ, పర్యాటక శాఖ అధికారి రాజశేఖర్‌రెడ్డి, తహసీల్దార్‌ హర్షద్‌, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంఈఓ బలరాం పాల్గొన్నారు.

ఇంటాక్‌కు పూర్తి సహకారం

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): సంస్కృతి, వారసత్వ పరిరక్షణతోపాటు గ్రామీణ ప్రభు త్వ పాఠశాలల విద్యార్థులకు అవకాశాలు క ల్పించడంలో ఇంటాక్‌ మహబూబ్‌నగర్‌ చాప్ట ర్‌ చేస్తున్న కృషి అభినందనీయమని కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా అన్నారు. ఇంటాక్‌ (ఐఎన్‌టీఏసీహెచ్‌) మహబూబ్‌నగర్‌ చాప్టర్‌ సభ్యులు కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలిసి చాప్టర్‌ కార్యకలాపాల వివరాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వ పరిరక్షణలో పంచాయతీల పాత్రపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని చెప్పారు. చాప్టర్‌ నిర్వహించే కార్యక్రమాలకు జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం నూతనంగా సభ్యత్వం పొందిన సభ్యులతో కలెక్టర్‌ ప్రతిజ్ఞ చేయించారు. అలాగే ఇంటాక్‌ ఢిల్లీ నిర్వహించిన సెలబ్రేటింగ్‌ ఇండియా జాతీయ పోస్టర్‌ పోటీలలో ప్రాంతీయ, చాప్టర్‌ స్థాయిలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. సమావేశంలో చాప్టర్‌ కన్వీనర్‌ నాగేందర్‌, కోకన్వీనర్‌ చంద్రకుమార్‌, అదనపు కోకన్వీనర్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement