విడతల వారీగా లాభం లేదు.. | - | Sakshi
Sakshi News home page

విడతల వారీగా లాభం లేదు..

May 20 2026 2:04 AM | Updated on May 20 2026 2:04 AM

త ప్రభుత్వ హయాంలో రైతుబంధు కింద పెట్టుబడి సాయం ఒకేసారి జమ చేయడంతో పంటల సాగుకు కావాల్సిన విత్తనాలు, పురుగు మందులు ఒకేసారి కొనుగోలు చేశాం. ఇప్పుడున్న ప్రభుత్వం రైతు భరోసా పథకం పేరిట విడతల వారీగా ఇవ్వడం వల్ల లాభం లేదు. పెట్టుబడి సాయం నిజంగా రైతుకు భరోసాగా నిలవాలంటే చెల్లింపులు ఆలస్యం కాకుండా సమయానికి అందించాలి.

– వెంకట్‌రెడ్డి, దొడ్డిపల్లి గ్రామం, నవాబుపేట మండలం

అర్హులందరికీ అందిస్తాం..

రైతు భరోసా అమలులో భాగంగా ఇప్పటికే రెండు విడుతలుగా అధిక శాతం మంది రైతుల ఖాతాల్లో నిధులు జమయ్యాయి. మిగిలిన అర్హులైన రైతులకు ప్రభుత్వం త్వరలోనే తప్పకుండా పెట్టుబడి సాయం అందిస్తుంది. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

– వెంకటేష్‌, జిల్లా వ్యవసాయశాఖ అధికారి

Advertisement
 
Advertisement
Advertisement