అలంపూర్: శిల్పకళా వైభవాన్ని చాటి చెప్పడమే వారోత్సవాల ముఖ్య లక్ష్యమని ప్రభుత్వ పాఠశాలల పీడీలు పార్వతమ్మ, భరత్ కుమార్, బలగం నాగరాజులు అన్నారు. అలంపూర్ పట్టణంలోని పురావస్తు మ్యూజియంలో అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవ వారోత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యాశాఖ, పురావస్తు శాఖ అధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో పీడీలు జెండా ఊపీ ర్యాలీని ప్రారంభించారు. మ్యూజియంలో పర్యాటకులు, ప్రజలు, విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించారు. పర్యాటకులు, స్థానికులు, ఆలయాల పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పురావస్తు శాఖ సిబ్బంది రవి, సంజీవ నాయుడులు, పాఠఽశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు, వివిధ ప్రాంతాల పర్యాటకులు పాల్గొన్నారు.


