మహబూబ్‌నగర్ క్రైం: రైల్వేస్టేషన్లు, రైళ్లలలో అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే డయల్ 100 లేదా రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలని మహబూబ్‌నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. టూటౌన్ సీఐ ఇజాజుద్దీన్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం పాలమూరు నగరంలోని రైల్వేస్టేషన్, ప్లాట్‌ఫాంల వద్ద ప్రయాణికులను తనిఖీ చేశారు. రైళ్లలో రాకపోకలు సాగించే ప్రయాణికుల బ్యాగ్‌లను నార్కోటిక్ జాగిలం రుద్ర సహాయంతో సోదాలు నిర్వహించారు. మత్తు పదార్థాలు రవాణా చేసినా.. వినియోగించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీల్లో డీసీఆర్‌బీ డీఎస్పీ రమణారెడ్డి, ఆర్‌ఐ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.


