అందమైన కొండల మధ్య నిర్మించిన కోయిల్‌సాగర్ ప్రాజెక్టు పర్యాటకానికి అనుకూలంగా ఉంది. గత ప్రభుత్వంలో ప్రాజెక్టులో బోటును ఏర్పాటు చేశారు. హరిత హోటల్, కాటేజీల నిర్మాణం, చిల్డ్రన్స్ పార్కు చేపట్టడానికి రూపకల్పన చేసి వదిలి వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏకో టూరిజం పేరుతో కోయిల్‌సాగర్‌ను అభివృద్ధి చేస్తామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి ప్రాజెక్టుల సందర్శించారు. పనులకు సంబంధించి సర్వే చేయడానికి ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టు వద్ద చేపట్టే పనుల కోసం రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు టూరిజం శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. వాటికి సంబంధించి ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు.


