‘ప్రజావాణి’కి 122 అర్జీలు | - | Sakshi
Sakshi News home page

‘ప్రజావాణి’కి 122 అర్జీలు

May 19 2026 12:52 AM | Updated on May 19 2026 12:52 AM

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో గృహ నిర్మాణం, విద్యుత్‌, గిరిజన సంక్షేమం, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, జిల్లా సంక్షేమ శాఖ, భూ సర్వే రికార్డులు, జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి, మిషన్‌ భగీరథ, జిల్లా మైనార్టీ సంక్షేమం, రోడ్డు రవాణా, బ్యాంకింగ్‌, పోలీస్‌, మైనింగ్‌, గ్రామీణ అభివృద్ధి, అటవీ శాఖ, విద్య, వైద్యం, నీటిపారుదల తదితర శాఖలకు సంబంధించిన మొత్తం 122 వినతులను అధికారులు నమోదు చేసుకున్నారు. అనంతరం ఆమె సెన్సస్‌పై తహసీల్దార్లు, ఎంపీడీఓలతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ జనగణనకు సంబంధించిన హెచ్‌ఎల్‌బీలను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు క్షేత్రస్థాయిలో పర్యటించి 100 శాతం హెచ్‌ఎల్‌బీలను వెంటనే ప్రారంభించి, త్వరితగతిన పూర్తిచేసి జనగణన ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మధుసూదన్‌నాయక్‌, హరిప్రియ, డీఆర్‌ఓ రాంరెడ్డి, జెడ్పీసీఈఓ, ఇన్‌చార్జి డీపీఓ వెంకట్‌రెడ్డి, డీఆర్‌డీఓ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

పోలీస్‌ గ్రీవెన్స్‌కు 26..

మహబూబ్‌నగర్‌ క్రైం: ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి పలువురు బాధితులు వివిధ సమస్యలపై ఎస్పీ జానకికి 26 ఫిర్యాదులు అందించారు. వాటన్నింటిని పరిశీలించిన తర్వాత ఆయా పోలీస్‌ స్టేషన్‌ అధికారులతో ఫోన్‌లో మాట్లాడుతూ సదరు ఫిర్యాదులపై ఆరా తీశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. పోలీస్‌ శాఖపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరింత పెంచేలా విధులు నిర్వహించాలని, ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేసి పరిష్కరించాలని ఆదేశించారు.

భవన నిర్మాణ కార్మికులకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి

జడ్చర్ల టౌన్‌: భవన నిర్మాణ కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే కార్మికుడి కుటుంబానికి చెల్లించే ఎక్స్‌గ్రేషియా రూ.20 లక్షలకు పెంచాలని బీసీ జాగృతి సేన కార్మిక విభాగం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్‌ అన్నారు. సోమవారం మండల విద్యా వనరుల కేంద్రం వద్ద నిర్వహించిన బీసీ జాగృతి సేన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గాయపడిన కార్మికులకు పూర్తిగా నయం అయ్యే వరకు ప్రభుత్వమే ఉచిత వైద్యం అందించాలని, కార్మికుని కూతురు పెళ్లి, కాన్పు కోసం చెల్లించే రూ.30 వేలకు బదులుగా పెళ్లికి రూ.లక్ష, కాన్పు ఖర్చు రూ.50 వేలకు పెంచాలన్నారు. ప్రతి పండగకు గుర్తింపు కార్డు కలిగిన కార్మికునికి రూ.2 వేలు నజరానా అందించాలన్నారు. పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, అలాగే ప్రభుత్వ కార్యాలయాల కాంట్రాక్టులను స్థానికంగా ఉన్న భవన నిర్మాణ కార్మికులకు ఇవ్వాలని కోరారు. పై అంశాలపై త్వరలోనే స్థానిక ఎమ్మెల్యేను కలిసి విన్నవించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేలా చూస్తామన్నారు. సమావేశంలో బీసీజాగృతి సేన రాష్ట్ర కార్యదర్శి రఘునందనచారి, నాయకులు నర్సింహులు, వెంకటేశ్‌, శేఖర్‌, మురళి, నాగేష్‌, శ్రీశైలం, ఫకీర్‌ జహంగీర్‌ తదితరులు పాల్గొన్నారు.

కోయిల్‌సాగర్‌

@ 72 ఏళ్లు

నిజాం కాలంలోనే శంకుస్థాపన

నిర్మాణ వ్యయం రూ.84 లక్షలు

అనంతరం 13 గేట్ల నిర్మాణానికి రూ.91 లక్షలు కేటాయింపు

ఎత్తిపోతల పథక రూపకల్పనకు రూ.359 కోట్లు

పర్యాటకానికి రూ.10 కోట్లు

Advertisement
 
Advertisement
Advertisement