నగరంలోని ప్రైవేట్ పాఠశాలలకు అనుమతులు, రెన్యూవల్ మంజూరులో అవినీతి, అక్రమాలు చోటుచేసుకుంటున్నట్లు ఇప్పటివరకు పదుల సంఖ్యలో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. కలెక్టరేట్‌లోని ప్రజావాణితోపాటు సంబంధిత శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు రాగా.. మర్లులోని ప్రైవేట్ స్కూల్‌కు సంబంధించి వివరణ ఇవ్వాలని ఆర్జేడీ కార్యాలయం నుంచి సదరు ఎంఈఓకు ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. దీనిపై సదరు అధికారి నుంచి స్పందన కరువైనట్లు ఆ శాఖ ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు సదరు ఎంఈఓపై ప్రజావాణిలో సైతం ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై సమగ్రంగా విచారణ చేపట్టాలని అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు)ను కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఇటీవల ఆదేశించగా.. ఈ మేరకు విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
నగర పరిధిలో పోస్టు లేకున్నా కొనసాగింపుపై విమర్శలు
ప్రైవేట్ పాఠశాల భవనం లేకున్నా అనుమతుల మంజూరు
ఫిర్యాదులు, ఆందోళనలే
ఆసరాగా అక్రమ వసూళ్లు?
ఆర్జేడీ, అడిషనల్ కలెక్టర్ స్థాయిలోవేర్వేరుగా విచారణ


