పట్టణ ప్రాంతంలో ఎంఈఓ పోస్టు ఉండదు. కానీ, లక్ష్మణ్‌సింగ్ మహబూబ్‌నగర్ రూరల్ ఎంపీడీఓ వద్ద చేరి తర్వాత పట్టణ ప్రాంతంలో ఎంఈఓగా చెలామణి అవుతూ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలపై పెత్తనం చేస్తున్నారు. ఈ విషయమై డీఈఓ, కలెక్టర్, ఆర్జేడీతోపాటు వివిధ స్థాయిల్లో ఫిర్యాదులు చేశాం. అధికారులు ఎంఈఓతో కుమ్మకై ్క చర్యలు తీసుకోవడం లేదు. – నాగరాజు, గవర్నమెంట్ టీచర్స్
అసోసియేషన్, సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
పట్టించుకోవడం లేదు..
జిల్లాకేంద్రంలో అనేక పాఠశాలలు అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని ఎంఈఓ, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. పాఠశాలల వద్ద ధర్నాలు చేస్తే ఎంఈఓ అక్కడికి వచ్చి సెటిల్‌మెంట్ చేసుకుని తర్వాత వాటిని వెంటనే తెరిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎంఈఓ చర్యలు పూర్తి నిర్లక్ష్యంగా ఉన్నాయి. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవు. – ప్రశాంత్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర నాయకులు
చర్యలు తీసుకోవాలి..
మహబూబ్‌నగర్ ఎంఈఓ అనుమతులు లేని పాఠశాలలకు అండగా నిలబడుతున్నారు. ప్రైవేటు పాఠశాలలు ఇచ్చే ముడుపులకు అలవాటు పడ్డాడు. ఇటీవల ఏర్పాటు చేసిన పలు పాఠశాలలకు ఇంటర్నేషనల్ అనే పేరు ఉండకూడదని జీఓ చెబుతుంది. అనుమతులు లేకపోయినా వాటికి మద్దతు ఇస్తున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశాం. వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలి.
– సంతోష్ రాథోడ్,
బంజారా గిరిజన విద్యార్థి సమైక్య రాష్ట్ర ఇన్‌చార్జి
ఆర్జేడీ ఆద్వర్యంలో విచారణ..
ఎంఈఓ లక్ష్మణ్‌సింగ్‌పై పలు ఫిర్యాదులు రావడంతో ఈ విషయాన్ని ఆర్జేడీ కార్యాలయానికి పంపించాం. ఇటీవల ఈ విషయంపై ఆర్జేడీ కార్యాలయం నుంచి విచారణ పూర్తి చేశారు. తదుపరి ఏం చర్యలు తీసుకుంటారనే విషయం అధికారుల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. – ప్రవీణ్‌కుమార్, డీఈఓ
●


