ఉన్నత విద్యకు ‘ఆస్థానం’ | - | Sakshi
Sakshi News home page

ఉన్నత విద్యకు ‘ఆస్థానం’

Apr 20 2026 9:47 AM | Updated on Apr 20 2026 9:47 AM

నాణ్యమైన విద్య

స్వయం ప్రతిపత్తిగల డా.బీఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల

జడ్చర్ల టౌన్‌: పట్టణంలోని డా.బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్వయం ప్రతిపత్తి కావటంతోపాటు తెలంగాణ రాష్ట్ర బొటానికల్‌ గార్డెన్‌తో ప్రత్యేక గుర్తింపు పొందింది. డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం దోస్త్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తుండటంతో తమ కళాశాలకు ప్రాధాన్యత ఇవ్వా లని కళాశాల అధ్యాపక బృందం, ప్రిన్సిపాల్‌ విన్నవిస్తున్నారు. ఆరు దశాబ్దాలుగా పేద ప్రజలకు నా ణ్యమైన విద్యను అందిస్తున్నట్లు పేర్కొంటున్నారు.

1963లో ప్రారంభం..

1963లో శ్రీరాంనగర్‌లోని ప్రస్తుత కోఎడ్యుకేషన్‌ జూనియర్‌ కళాశాల వద్ద డిగ్రీ కళాశాల ప్రారంభం అయ్యింది. ఆర్ట్స్‌, సైన్స్‌తో పాటు జూనియర్‌ కళాశాల నిర్వహించేవారు. ఆ తరువాత సిగ్నల్‌గడ్డపై మాజీ ఎమ్మెల్యే కొత్తకేశవులు కృషితో ప్రస్తుతం ఉన్న స్థలం సేకరించి నూతన భవనం నిర్మించారు. 1991లో నూతన భవనంలోకి ఇంటర్‌, డిగ్రీ కోర్సుల్లో ఆర్ట్స్‌ కామర్స్‌ను బదిలీ చేశారు. సైన్స్‌ మాత్రం పాత భవనంలోనే కొనసాగించారు. ఆ తరువాత కొన్నాళ్లకే సైన్స్‌ కోర్సులు సైతం ఇక్కడికి తీసుకొచ్చారు. ఇదే సమయంలో ఇంటర్మీడియేట్‌ పాత కళాశాల భవనంలోకి, డిగ్రీ కోర్సులన్ని సిగ్నల్‌గడ్డ భవనంలోకి మార్చారు. అప్పటి నుంచి 1990 దశకం నుంచి పూర్తిస్థాయిలో డిగ్రీ కళాశాల ప్రారంభమైంది.

న్యాక్‌లో ఏ గ్రేడ్‌

2025 ఆరంభంలో న్యాక్‌ బృందం కళాశాలను సందర్శించి ఏ గ్రేడ్‌ను కేటాయించింది. దీంతో కళాశాలకు స్వయం ప్రతిపత్తి లభించింది. దీని ద్వారా పరీక్షల నిర్వహణ, కోర్సుల ఏర్పాటు వంటివి స్వయంగా నిర్ణయించే వెసులుబాటు కలిగింది.

ఆరు దశాబ్దాలుగా విద్యార్థులకు

నాణ్యమైన విద్య

రాష్ట్రంలోనే గుర్తింపు పొందిన

బొటానికల్‌ గార్డెన్‌

దోస్త్‌లో ప్రాధాన్యత ఇవ్వాలని విన్నవిస్తున్న కళాశాల అధ్యాపక బృందం

దోస్త్‌ అడ్మిషన్లు ప్రారంభం అయినందున ఆన్‌లైన్‌లో డా.బీఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఎంచుకోవాలి. నాణ్యమైన విద్యను అందించటంతోపాటు వ్యక్తిత్వ వికాసం, నాయ కత్వ లక్షణాలు పెంపొందిస్తాం. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సమయంలో ఏవైనా సందేహాలుంటే కళాశాలలోని సాంకేతిక విభాగం అన్ని విధాలుగా

సహకరిస్తుంది.

–డా.సుకన్య, ప్రిన్సిపాల్‌,

డా.బీఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల

Advertisement
 
Advertisement
Advertisement