ముందు ఒక లెక్క చేయడానికి నిమిషాల సమయం పట్టేది. ఇప్పుడు అదే లెక్కను సెకండ్లలో చేస్తాం. గణితం అంటే భయం పోయింది. – గౌతమి, విద్యార్థిని, పెదిరిపాడు
విస్తరణ అవసరం..
ప్రస్తుత ఫలితాలను దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని మరిన్ని పాఠశాలలకు విస్తరించి మరింత మంది విద్యార్థులకు అందించాల్సిన అవసరం ఉంది. లెక్కలంటే భయం అనే భావనను తొలగించి ఆసక్తిగా మార్చగల సామర్థ్యం ఈ కార్యక్రమంలో ఉందని స్పష్టం అవుతోంది.
– బాలకిష్టప్ప, ప్రధానోపాధ్యాయుడు
స్పష్టమైన మార్పు..
విద్యార్థులు గణితాన్ని సులభంగా అర్థం చేసు కొని వేగంగా చేయగలిగే స్థాయికి చేరుకోవడం ఈ కార్య క్రమం విజయాన్ని సూచిస్తోంది. తక్కువ సమయంలోనే స్పష్టమైన మార్పు కనిపించడం ప్రత్యేకం.
– విద్యాసాగర్,
అకాడమిక్ మానిటరింగ్ అధికారి
మంచి ఫలితాలొచ్చాయి..
గణితంపై విద్యార్థుల్లో ఉన్న భయాన్ని తగ్గిస్తూ ప్రాథమిక నైపుణ్యాలను బలోపేతం చేసే దిశగా వేదిక్ మ్యాథమెటిక్స్ కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తోంది. ముఖ్యంగా గ్రామీణ పాఠశాలల్లో ఆత్మవిశ్వాసం పెరగడం ప్రశంసనీయమైన అంశం.
– డా. గోవిందరాజు, జిల్లా విద్యాధికారి
●


