జడ్చర్ల: ఇంటినుంచి బహి ర్భూమికి వెళ్లిన ఓ వ్యక్తి ప్ర మాదవశాత్తు చెరువులో పడి మృతిచెందిన ఘటన మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ కమలాకర్ కథ నం మేరకు.. నాగసాలకు చెందిన పోలే భీమేశ్వర్(33) ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం ఇంటినుంచి వెళ్లాడు. పనిమీద ఎక్కడికో వెళ్లి ఉంటాడని కుటుంబ సభ్యు లు భావించారు. రాత్రివరకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల, బంధువుల వద్ద వెతికినా జాడలేదు. సోమవారం గ్రామ శివారులోని చెరువులో మృతదేహమై తేలాడు. భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


