సమతుల్య ఎరువులు.. అధిక లాభాలు | - | Sakshi
Sakshi News home page

సమతుల్య ఎరువులు.. అధిక లాభాలు

Mar 3 2026 8:58 AM | Updated on Mar 3 2026 8:58 AM

పైరుపై పోషకాల పిచికారీ ఎరువులు ఎంపిక ఇలా..

అలంపూర్‌: పంటల సాగులో ఎరువుల వాడకంపై అవగాహన ఉండాలి. ప్రధానంగా పండ్ల తోటలు సాగు చేసే రైతులు సమతుల్య ఎరువులపై ప్రత్యేక దృష్టి సారిస్తే అధిక దిగుబడి సాధించవచ్చని ఏడిఏ సక్రియ నాయక్‌ రైతులకు సూచిస్తున్నారు. ముఖ్యంగా పండ్ల తోటల సాగులో చెట్టు వయస్సును బట్టి మొక్కతాలుకు వేర్లు తలకట్టు వరకు వ్యాపించి ఉంటాయి. అంత వరకు పాదు చేయాలి. సాధారణంగా నేల పై పొరలలోని పీచు వేళ్ల సముదాయం పో షకాలను చురుకుగా తీసుకుంటుంది. మొక్క మొద లు నుంచి వయస్సును బట్టి 1 లేదా 11/2 దూరం వదిలి వేయాలి. నేలలో తగినంత తేమ ఉన్న సమయాల్లో పాదంత ఎరువులు చల్లి పారతో పలుచగా తిరగవేయ్యాలి. దీనివల్ల ఎరువులు మట్టిలో కలిసిపోతాయి. ఆవిరి ద్వారా గాని, నీటి ద్వారా గాని పోషకాలు నష్టమయ్యే అవకాశం ఉండదు. ఇది మేలైన పద్ధతి. పెద్ద చెట్లకు నాలుగు వైపుల నాలుగు చిన్న గుంతలు (30 సెం.మీ వెడల్పు, 15 సెం.మీ లోతు) తీసి అందులో సమానంగా ఎరువు వేసి మట్టితో కప్పి నీరు పెట్టాలి. లేదా అదే లోతులో వలయాకారంలో గాడి తీసి ఎరువులు వేసి మట్టితో కప్పి నీరు పెట్టాలి. ఈ పద్ధతిలో ఎరువులు వేయడాన్ని రింగ్‌ ప్లేస్‌మెంట్‌ అంటారు.

భూమిలో తగినంత తేమ లేనప్పుడు ఎరువులు వే సి న తర్వాత నీళ్లు పెట్టడానికి అనుకూలంగా లేనప్పు డు ప్రత్యేకించి కొద్ది పరిమాణంలో అవసరమైన పో షకాలను అందించడానికి పిచికారీ పద్ధతి అనువుగా ఉంటుంది. సాధారణంగా అన్నీ పైర్లపైన ఫల వృక్షాల మీద 2 నుంచి 3 శాతం యూరియా ద్రావణం పిచికారీ చేయవచ్చును. మొక్కలు సూక్ష్మ పోషకాల ను నేలలో వేసిన దాని కన్నా పిచికారీ పద్ధతిలో శక్తివంతంగాత్వరితగతంగా ఉపయోగించుకుంటా యి. ఇటీవల ప్రాచుర్యంలోకి వచ్చిన స్ప్రింక్లర్లు, డ్రిప్‌ పద్ధతుల ద్వారా సాగునీటితో పాటు ద్రవ ఎరువులను కలిపి అందించడం వల్ల ఖర్చు తగ్గుతుంది.

యూరియా, అమ్మోనియం సల్ఫేట్‌, కాల్షియం అమ్మోనియం నైట్రేట్‌ ఎరువుల్లో ఉన్న ముఖ్య పోషకాలు. నత్రజని అయినప్పటికీ అది రసాయనికంగా వివిధ రూపాల్లో ఉంటుంది. ఎరువుల లక్షణాలు వేర్వేరుగా ఉంటాయి. ఇసుక ఎక్కువగా ఉన్న మాగాణి భూముల్లో తప్ప మిగితా అన్నీ నేలలకు, పంటలకు పైరు అడుగులోతు యూరియా వేసుకోవచ్చు. అమ్మోనియం సల్ఫేట్‌ క్షార గుణం నేలలకు, సున్నపు పాలు ఎక్కువ గల నేలలకు ఎప్పుడైన వేసుకోవచ్చును. సూపర్‌ ఫాస్ఫేట్‌ను సాధారణంగా అన్ని రకాల నేలలకు వేయవచ్చును. ఆమ్లగు ణం గల నేలలకు సల్‌పైడ్‌ ఇంజురీ వచ్చే నేలలకు వేయకపోవడం మంచిది. ఆమ్లగుణం నేలలకు డైకాల్షియం ఫాస్పేట్‌, రాక్‌ ఫాస్ఫేట్‌ వంటివి ఉప యోగకరంగా ఉంటాయి. మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ను పాలచౌడు నేలలకు తప్ప మిగిలిన అన్ని నేలలకు ఉపయోగించవచ్చు. కాంప్లెక్స్‌ల్లో ఎరువుల్లో అమ్మోనియం ఫాస్ఫేట్లు అన్ని నేలలకు అన్ని పైర్లకు వేయవచ్చును. నైట్రో ఫాస్ఫేట్‌లు మెట్ట, ఆరుతడి తోట పైర్లకు, ఎర్రనేలలకు, సామాన్య రసాయన స్థితిగల నేలలకు, కొద్దిపాటి ఆమ్లగుణం గల నేలలకు బాగా ఉపయోగపడతాయి. అలాగే పంటలకు నత్రజని 2 నుంచి 4 సార్లు, భాస్వరం ఒకసారి, పోటాష్‌ను రెండు సార్లు అందిస్తే దిగుబడి బాగా వచ్చే అవకాశం ఉంటుంది.

పాడి–పంట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement