అలివేలుమంగమ్మ ఆలయంలో ధ్వజారోహణం | - | Sakshi
Sakshi News home page

అలివేలుమంగమ్మ ఆలయంలో ధ్వజారోహణం

Mar 3 2026 8:58 AM | Updated on Mar 3 2026 8:58 AM

అలివేలుమంగమ్మ ఆలయంలో ధ్వజారోహణం

కనులపండువలా హనుమత్‌వాహన సేవ

స్వర్ణాభరణాలంకరణలో

దర్శనమిచ్చిన అమ్మవారు

మహబూబ్‌నగర్‌ రూరల్‌: మన్యంకొండ శ్రీఅలివేలు మంగతాయారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమ వారం ధ్వజారోహణం వై భవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా దేవస్థానం సమీపంలో ఉన్న పుట్ట వద్ద ప్రత్యే క పూజలు చేసి ఆ మట్టిని తీసుకొచ్చి హోమం నిర్వహించారు. దేవస్థానం పక్కనున్న మండపంలో సాంప్రదాయ రీతిలో పురోహితుల వేదమంత్రాల మధ్య హోమా న్ని నిర్వహించారు. అనంతరం ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు చేసి ధ్వజారోహణ నిర్వహించారు. అలాగే అమ్మవారి సన్నిధిలో దేవతాహ్వానం, బలిహరణ, ఎదుర్కోలు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఘనంగా సేవ..

ఉత్సవాల్లో భాగంగా దేవస్థానంలో సోమవారం రాత్రి హనుమత్‌వాహన నిర్వహించారు. శోభాయమానంగా అలంకరించిన అమ్మవారిని గర్భగుడి నుంచి దేవస్థానం ముందున్న మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాల మధ్య ఈ సేవ ముందుకు కదిలింది. భక్తుల హరినామశ్చరణతో సేవా ప్రాంతం మారుమోగిపోయింది. వివిధ రకాల పూలు, బంగారు ఆభరణాల అలంకరణలో అమ్మవారు సేవలో దేవస్థానం పరిసరాల్లో ఊరే గుతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. ఈ దృశ్యాన్ని చూసి భక్తులు భక్తిపారవశ్యంతో పులకించిపోయారు.దేవస్థానం చైర్మన్‌ అళహరి మధుసూదన్‌కుమార్‌, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్‌ నిత్యానందచారి అర్చకులు పాల్గొన్నారు.

నేడు మన్యంకొండ ఆలయం మూసివేత

చంద్ర గ్రహణం సందర్భంగా మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి, శ్రీ అలివేలు మంగతాయారు అమ్మవారు, శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాలు మంగళవారం ఉదయం 9గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆలయం మూసివేయనున్నట్లు ఆల య చైర్మన్‌ అళహరి మధుసూదన్‌కుమార్‌, ఈఓ శ్రీనివాసరాజు ప్రకటనలో తెలిపారు. రాత్రి 9గంట ల తర్వాత ఆలయ శుద్ధి, సంప్రోక్షణ చేశాక భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement