అంగన్‌వాడీల్లో మెనూ తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీల్లో మెనూ తప్పనిసరి

Mar 3 2026 8:58 AM | Updated on Mar 3 2026 8:58 AM

నిర్వహణ పరిశీలించిన

ఆసియా అభివృద్ధి ‘బ్యాంక్‌’ కమిటీ

చెంచుగూడెం, పద్మన్నపల్లి

కేంద్రాల సందర్శన

బల్మూర్‌/లింగాల: అంగన్‌వాడీ కేంద్రాల్లో రోజు వారీ మెనూ తప్పనిసరి పాటించాలని ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ కమిటీ బృందం సభ్యులు సూచించారు. జిల్లా సంక్షేమాధికారి రాజేశ్వరి ఆధ్వర్యంలో సోమవారం బల్మూర్‌ ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని చెంచుగూడెం, పద్మన్నపల్లి గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలను ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ కమిటీ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రీస్కూల్‌ పిల్లల వివరాలు సేకరించారు. రోజువారీ మెనూ ప్రకారం ఇచ్చే భోజనాన్ని పరిశీలించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులతో మాట్లాడి అంగన్‌వాడీల నిర్వహణపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రధానంగా బరువులు, ఎత్తులు, పోషణ స్థితులతోపాటు పోషణ వాటికల్లో ఆకుకూరలతో చేసిన భోజనం అందించాలని, వాటి ప్రయోజనాలను అంగన్‌వాడీ టీచర్లు, లబ్ధిదారులకు సూచించారు. గ్రామాల్లో కిశోర బాలికలను గుర్తించి వారికి సరైన పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్రాల్లో చిన్నారులకు ఆటల కోసం నిచ్చెనలు, జారుడుబాల్లా, మిల్లెట్స్‌ సరఫరా చేయాలని తల్లిదండ్రులు బృందం సభ్యులను కోరారు. కార్యక్రమంలో ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ కమిటీ(ఏడీబీ) బృందం అధికారులు నిన బైడ్‌ గైయర్‌(సీనియర్‌ న్యూట్రీషన్‌ ఎక్స్‌ఫర్టు ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌,) మనిక సోది (కెసాసిటీ పబ్లిక్‌ బిల్డింగ్‌ ఎక్స్‌ఫర్టు), పూజ కెమినీ పల్లిక్‌ పాలసి), హంస్త ఆరోరా (న్యూట్రీషన్‌ ఎక్స్‌ఫర్ట్‌), కరుణశ్రీ డైరెక్టర్‌ ఆఫ్‌ హైదరాబాద్‌, సీడీపీఓ దమయంతి, సూపర్‌వైజర్లు గిరిజ, నిర్మల, అంగన్‌వాడీ టీచర్లు పోశమ్మ, రాధమ్మ, తలిదండ్రులు, పిల్లలు ఉపాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement