రంగుల జాతర.. హోలీ సంబురాలు | - | Sakshi
Sakshi News home page

రంగుల జాతర.. హోలీ సంబురాలు

Mar 3 2026 8:58 AM | Updated on Mar 3 2026 8:58 AM

ఆవిర్భావం, మొదలు ఎక్కడ

సహజ సిద్ధమైన రంగులు

మదనాపురం: వసంతకాలపు రాకను చాటుతూ ప్రకృతి పులకించే వేళ వచ్చే రంగుల పండుగ హోలీ. జాతి, కుల, మత భేదాలను విస్మరించి అందరూ ఒక్కటయ్యే అద్భుతమైన వేడుక ఇది. కేవలం రంగులు చల్లుకోవడం మాత్రమే కాదు, చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నం. పురాణాల ప్రకారం, విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడిని చంపాలనుకున్న హోలిక అనే రాక్షసి మంటల్లో కాలి బూడిదైన సందర్భాన్ని హోలికా దహనంగా జరుపుకుంటారు. భక్తి ముందు శక్తి ఓడిపోతుందని చెప్పే సందేశం ఈ పండుగలో దాగి ఉంది.

ప్రాచీన భారతీయ గ్రంథాల్లో శిల్పకళల్లో హోలీ ప్రస్తావన ఉంది. ముఖ్యంగా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు బృందావనంలో గోపికలతో కలిసి రంగులు చల్లుకోవడం ద్వారా పండుగకు అత్యంత ప్రాచుర్యం లభించింది. మొదట్లో ఇది రైతుల పండుగగా ఉండేది. శీతాకాలం ముగిసి, పంటలు చేతికి వచ్చే తరుణంలో ప్రకృతికి కృతజ్ఞతగా అన్నివర్గాల ప్రజలు వేడుకను జరుపుకునేవారు.

అప్పట్లో మోదుగపూలు పసుపు, కుంకుమ, వేపఆకుల వంటి ప్రకృతి సిద్ధమైన వస్తువులతో రంగులు తయారు చేసేవారు. ఇవి ఆరోగ్యానికి మేలు చేసేవి. ఊరంతా ఒక్కచోట చేరి జానపద పాటలు పాడుతూ, తప్పెట్లు కొడుతూ ఆ డేవారు. మనుషుల మధ్య అంతరాలు ఉండేవి కా వు. ఆధునిక హంగులు.. అప్రమత్తత అవసరం నేడు హోలీ స్వరూపం మారింది. టెక్నాలజీ, మ్యూజిక్‌ ప్రస్తుతం డీజే పాటలు, రెయిన్‌ డ్యాన్స్‌ పార్టీలు హోలీలో భాగమయ్యాయి. యువత పెద్దఎత్తున గ్రూపులుగా చేరి వేడుకలు చేసుకుంటున్నారు. అప్పట్లో ఉన్న స్వచ్ఛత తగ్గి, కెమికల్‌ రంగుల వాడకం పెరిగింది. అయితే, ప్రస్తుతం అవగాహన పెరిగి చాలామంది ఆర్గానిక్‌ హోలీ వైపు మొగ్గు చూపుతున్నారు. హోలీ పండుగ అంతరార్థం ప్రేమ, క్షమ, కోపతాపాలను మంటల్లో కాల్చేసి కొత్త రంగులతో జీవితాన్ని ప్రారంభించడమే దీని పరమార్థం. పరస్పర గౌరవం, సోదరభావం పెంపొందించుకోవడమే రంగుల పండుగ మనకు అందించే తియ్యని సందేశం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement