కొల్లాపూర్‌రూరల్: మండలంలోని మొలచింతలపల్లి గ్రా మానికి చెందిన యువకుడు సాయి (23) సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామస్తుల కథనం ప్రకారం చాకలి సాయి తల్లిదండ్రులు గద్వాలకు వలస కూలీగా వెళ్లారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని స్నేహితులు కిటికిలోంచి చూడ గా విగత జీవిగా కన్పించాడు.ఈ విషయం గ్రా మస్తులకు తెలియడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆత్మహత్యపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
దొంగతనం బయటపడిందని..
కోడేరు: ఉరేసుకొని ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని తీగలపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సెల్ ఫోన్ పోగొట్టుకొన్నాడు.గ్రామపెద్దలు నరేష్ (26)పై అనుమానం వ్యక్తం చేశారు. అందరిసమక్షంలో దొంగతనం బయటపడటంతో మన స్తాపానికి గురై ఇంటి ముందున్న వేపచెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.మృతుడి తల్లి మణెమ్మ ఫిర్యాదు మేరకు పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసి ఎస్‌ఐ వేణుగోపాల్ తెలిపారు.
డీసీఎం, బైక్ ఢీ: ఒకరు మృతి
కల్వకుర్తి రూరల్: మండలంలోని మార్చాల వద్ద కోదాడ–జడ్చర్ల జాతీయ రహదారిపై సోమవారం మధ్యా హ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న చాంద్ పాషా (64) అక్కడికక్కడే మృతి చెందగా చారకొండ రాములుకు తీవ్ర గాయాలయ్యాయి. ఊరుకొండ మండలం గుండ్లకుంటపల్లికి చెందిన రాములు పని నిమిత్తం కల్వకుర్తికి వచ్చారు. పని ముగించుకుని గ్రామానికి వెళ్తుండగా కాటన్ మిల్ సమీపంలో ఉన్న మైసమ్మ ఆలయం వద్ద చాంద్ పాషా లిఫ్ట్ అడగడంతో బైక్‌పై ఎక్కించుకున్నారు. ఈ క్రమంలో మార్చాల గ్రామ మలుపు వద్దకు రాగానే జడ్చర్ల నుంచి కల్వకుర్తి వైపు వస్తున్న డీసీఎం బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు కింద పడడంతో తీవ్ర గాయాలై ఒకరు మృతి చెందారు. రాములు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. కాగా బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
వెల్దండ: మండలంలోని యెన్నం ఆస్పత్రి సమీ పంలో హైదరాబాదు–శ్రీశైలం జాతీయ రహదారిపై సోమవారం డీసీఎం, బైక్ ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. పోలీ సుల కథనం ప్రకారం.. గాన్‌గట్టుతండా జీపీ పరిధిలోని ఒంటిగుడిసెతండాకు చెందిన వంకుడావత్ గణేశ్(32) బైక్‌పై వెల్దండ నుంచి కల్వకుర్తి వైపు వెళ్తున్నాడు. కల్వకుర్తి నుంచి హై దరాబాద్ వెళ్తున్న డీసీఎం ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న గణేశ్ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గణేశ్ కల్వకుర్తి ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఘటనా స్థలాన్ని ఎస్‌ఐ కురుమూర్తి పరిశీలించి మృతదేహాన్ని కల్వకుర్తి ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్య బుజ్జితోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.
చెరువులో పడి మహిళ మృతి
మక్తల్: చెరువులో పడి ఓ మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని జక్లేర్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన లకా సంజమ్మ(46)కు మతిస్థిమితం సరిగా లేదు. ఆదివారం పులిమామిడి వెళ్లే క్రమంలో చెరువు కట్టపై నడుచుకుంటూ వె ళ్తుండగా కాలు జారి చెరువులో పడిపోయింది. దీంతో బయటికి రాలేక మరణించింది. ఈ ఘ టనపై మృతురాలి చెల్లెలు చిన్న సంజమ్మ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ భాగ్యలక్ష్మిరెడ్డి తెలిపారు.


